ఈ వారం కొత్త కెప్టెన్ గా కీర్తి భట్.. వరెస్ట్ పర్ఫామర్ గా అర్జున్!
ప్రతీ రోజు ఏదో ఒక రకమైన వినోదం ప్రేక్షకులకు తీసుకొస్తుంది 'బిగ్ బాస్'. అయితే ఇరవై ఆరవ రోజు మాత్రం కాస్త భిన్నంగా జరిగింది. ఒకే రోజు 'కొత్త కెప్టెన్', 'వరెస్ట్ పర్ఫామర్' నియామకం జరగడం అనేది ప్రేక్షకులకు 'డబుల్ ఎంటర్టైన్మెంట్ ' లా అనిపిస్తోంది. మొట్టమొదటి 'ఫీమేల్ కెప్టెన్' గా 'కీర్తి భట్' ఎన్నుకైంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు కెప్టెన్ లుగా ఆదిరెడ్డి, ఆదిత్య, రాజ్ కెప్టెన్ గా చేయగా, హౌస్ లో తొలి మహిళా కెప్టెన్ గా 'కీర్తి భట్' కావడం బాగుందని హౌస్ మేట్స్ లో అందరూ అనుకున్నారు...