English | Telugu
అత్తా కోడళ్ల రిలేషన్ గురించి ఒక రేంజ్ లో చెప్పిన జ్యోతక్క!
Updated : Oct 3, 2022
ఈటీవీ వారి బతుకమ్మ స్పెషల్ ఈవెంట్ లో "బంగారు బతుకమ్మ" పేరుతో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో అత్తలు కోడళ్ళకు మధ్య వార్ బాగా జరిగింది. బుల్లి తెర నటీమణులంతా అత్తా కోడళ్ళుగా విడిపోయి ఈ షోని రక్తి కట్టించారు. ఇక కోడళ్ళు అత్తలను కాకా పట్టడానికి భజన చేస్తుంటారు.
వెంటనే హోస్ట్ శ్రీముఖి "ఇంక ఆపుతారా మీ భజన కార్యక్రమాలు" అనేసరికి జ్యోతక్కకి బాగా కోపం వచ్చేసి అసలు శ్రీముఖి నీకేం తెలుసు మా అత్తా కోడళ్ల బాండింగ్ గురించి అంటూ "కోడళ్లను ఎప్పుడూ కంట్రోల్ లో పెట్టుకోవాలనే అత్త, అత్తను కాకాపట్టాలని చూసే కోడళ్ళు, ఇంటి పని నాదంటే నాది అంటూ వాళ్లలో వాళ్ళు యుద్దాలు చేసుకుంటూనే ఉంటారు..వాళ్ళను మించిన వారియర్స్ ఎవరు. ఇంట్లో ఎంత కొట్టుకుని తిట్టుకున్నా బయటి నుంచి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ముందు ప్రేమను నటిస్తారు. వాళ్ళను మించిన ఆర్టిస్టులు ఎవరున్నారు.
పగలంతా ఎలా ఉన్నా సాయంత్రం అయ్యేసరికి ఒకే సీరియల్ చూసుకునే వాళ్ళను మించిన ఫ్రెండ్స్ ఎవరున్నారు, పెళ్లికైనా, పేరంటానికైనా, ఫంక్షన్ కైనా ఆఖరికి ఫారెన్ కైనా సరే ఒళ్ళంతా నగలు వేసుకుని జంటగా వెళ్లే వాళ్ళను మించిన ప్రేమికులు ఎవరున్నారు. ఇంట్లో, బయట ఎలాంటి పరిస్థితినైనా స్మూత్ గా హ్యాండిల్ చేసే వీరనారీమణులు ఎవరు, వాళ్ళే రైటర్స్, వాళ్ళే ఫైటర్స్, వాళ్ళే క్రియేటర్స్, వాళ్ళే డిక్టేటర్స్ వాళ్ళే అన్నీ.." అంటూ ఒక రేంజ్ లో అత్తా కోడళ్ల గురించి పవర్ ఫుల్ డైలాగ్ చెప్పింది జ్యోతక్క .