English | Telugu
అలా అనుకుంటే ఈ ప్రపంచంలో ఒక్క పెళ్లీ నిలబడదు!
Updated : Oct 1, 2022
స్మిత పాప్ సింగర్ గా అందరికీ పరిచయం ఉన్న అమ్మాయే. ఎన్నో ఆల్బమ్స్ చేసింది. అలాగే ఎన్నో సింగింగ్ షోస్ కి జడ్జిగా చేసింది. అలాగే సక్సెస్‌ఫుల్ బిజినెస్ విమన్ గా కూడా పేరు తెచ్చుకుంది. ఐతే స్మిత పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ఏ ఇద్దరూ పర్ఫెక్ట్ కారు. మనలో ఎన్ని లోపాలుంటాయో మన లైఫ్ పార్టనర్ గా వచ్చే వాళ్ళలోనూ అన్నే లోపాలు ఉంటాయి. కానీ వాటిని బూతద్దంలో చూస్తూ లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడం నిజంగా అవివేకం." అని ఆమె చెప్పింది.
కానీ ఈ రోజున చాలామంది అలానే చేస్తున్నారని బాధపడ్డ ఆమె, "ఎవరికి వారు మేమే పర్ఫెక్ట్ అనుకుంటే ఈ ప్రపంచంలో ఒక్క పెళ్లి కూడా నిలబడదు. మన అనుకుని మన వాళ్ళ కోసం నేను ఉన్నాను అనుకుంటేనే ఏదైనా చేయగలం. నా అభిప్రాయం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఎవరికి వారు ఇండిపెండెంట్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎవరికీ వారు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటారు.. అలాగే వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చక్కగా నెరవేర్చే అవకాశం ఉంటుంది. నేను ఈ కుటుంబానికి ఎక్కువ చేసాను, నేను తక్కువ చేసాను అని అనుకోకుండా ఫ్యామిలీని అద్భుతంగా నడిపించవచ్చు." అని అభిప్రాయపడింది.
"ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నమ్మకం, గౌరవం అనేవి చాలా అవసరం. ఇవి ఉన్నప్పుడు ఏ రిలేషన్ ఐనా ఎక్కువ కాలం ఉంటుంది. లేదంటే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగానే ఉంటుంది." అంటూ పెళ్లి గురించి, చిన్న చిన్న కారణాలకు విడిపోతున్న భార్యాభర్తల సంబంధానికి ఒక కొత్త అర్థం చెప్పింది స్మిత.