English | Telugu

వర్ష, ఇమ్ము పెళ్ళికి వచ్చిన స్టార్ హీరోస్!

ఎక్స్ట్రా జబర్దస్త్ కొంత కాలం నుంచి మంచి స్కిట్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇందులో వర్ష, ఇమ్మానుయేల్ జోడి చేసే సందడి హైలైట్ గా నిలుస్తోంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఐతే వర్ష, ఇమ్ము ప్రేమ ఓపెన్ సీక్రెట్ గా మారిపోయింది. కొంత కాలం ఇద్దరి మధ్యన మాటలు లేవు. మళ్ళీ ఈ స్టేజెస్ మీద సారీ చెప్పుకోవడం, కలిసిపోవడం కామన్ ఐపోయింది వీళ్లిద్దరికీ. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి పీటలు ఎక్కేయడానికి రెడీ ఇపోయారు.

స్టేజ్‌పై వీళ్ళ కెమిస్ట్రీ వేరే లెవెల్. ఇక తమ పెళ్లి జరగాలంటే ఒక పని చేయాలని ఒక సూపర్ కండిషన్ పెట్టింది వర్ష. "ఇమ్మూ మన పెళ్లి జరగాలంటే చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌ ఉండాలి " అంటుంది.. వెంటనే ఇమ్మాన్యుయెల్‌ "అంతేనా నాకు చిరంజీవి, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌ అందరూ తెలుసు" అంటూ బిల్డప్‌ ఇచ్చేసరికి ఐతే వాళ్లందరినీ తీసుకోచ్చేయ్ ..పెళ్లి చేసుకుందాం" అని చెప్పింది వర్ష. వెంటనే చిరంజీవి, నాగార్జున, పవన్‌ కళ్యాణ్ డూప్స్ వీళ్ళ పెళ్ళికి వచ్చేసారు. వాళ్లంతా డాన్సులు వేసి హంగామా చేశారు. ముందు మనం ఒక సంగీత్ ఫంక్షన్ పెట్టుకుందాం అని ఇమ్ముని అడిగింది వర్ష.

తర్వాత "కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు" సాంగ్ కి డూప్ హీరోస్ తో కలిసి వర్ష స్టెప్పులేస్తుంది. ఇది చూసిన ఇమ్ము చిరు, నాగ్‌, పవన్‌ డూప్స్ కి సారీ చెబుతూ, "ఆమె ఇంతకు ముందు అదే చేసేది అందుకే ఆ పాట పెట్టించి అవే స్టెప్పులు వేయించింది, ఏమనుకోకండి" అనేసరికి అందరూ నవ్వేశారు కానీ వర్ష ముఖం మాత్రం మాడిపోయింది. ఇక ఈ ఎపిసోడ్ లో గెటప్ శ్రీను, గౌతమ్‌రాజు, రాకేష్‌ టీమ్‌ పెర్ఫార్మ్ చేసిన స్కిట్లు సైతం నవ్వులు పూయించాయి. దీనికి ఖుష్బు చాలా ఖుషి ఐపోయి "ఇదే అసలు సిసలైన కామెడీ షో" అంటూ కితాబిచ్చింది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.