English | Telugu
భార్య శ్రీమంతానికి పక్కన లేడని ఉద్వేగానికి లోనైన రేవంత్!
Updated : Sep 30, 2022
'బిగ్ బాస్' హౌస్ లో రోజుకో కొత్త సన్నివేశం చోటుచేసుకుంటోంది. నిన్నటి దాకా 'హోటల్ వర్సెస్ హోటల్' టాస్క్ తో అలరించిన కంటెస్టెంట్స్ నేడు ఆ టాస్క్ లో ఎవరెవరు ఎలా ఉన్నారో, ఎవరు ఎవరికి సపోర్ట్ చేసారోనని కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. అయితే కొన్నిసార్లు 'బిగ్ బాస్' సర్ ప్రైజ్ లతో, అటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని, ఇటు చూసే ప్రేక్షకులని ఆకట్టుకుంటాడు. 'బిగ్ బాస్' నుండి ఎలిమినేట్ అయిన 'నేహ' పుట్టినరోజుకి వాళ్ళ బ్రదర్ ని పంపించి ఆశ్చర్యపరిచాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో రేవంత్ కి 'సర్ ప్రైజ్' చేసాడు బిగ్ బాస్. రేవంత్ హౌస్ లోకి రాకముందే 'తండ్రి కాబోతున్నాడు' అనే విషయం తెలిసిందే. ఆ విషయాన్ని 'బిగ్ బాస్ లాంచ్' రోజునే నాగార్జున చెప్పాడు. ఆ రోజు స్టేజ్ మీదకు రేవంత్ భార్య కూడా వచ్చింది.
రీసెంట్ గా రేవంత్ కుటుంబ సభ్యులు తన భార్య అన్విత కి శ్రీమంతం చేసారు. ఆ శ్రీమంతం కార్యక్రమం లో రేవంత్ లేడు. దీంతో 'బిగ్ బాస్' , 'రేవంత్ మీరు ఒక్కరే గార్డెన్ ఏరియాకు రండి' అని బిగ్ బాస్ చెప్పాడు. మునుపటి వారం మీ భార్య శ్రీమంతం జరిగింది. ఆ మధుర క్షణాలను బిగ్ బాస్ మీకు చూపించాలనుకుంటున్నాడు" అని చెప్పాడు. శ్రీమంతం వేడుకలను రేవంత్ ఆ వీడియో చూసి చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. తను ఆ వేడుకలో ఉంటే చేసే సంప్రదాయాన్ని టీవిలో కనిపించే తన భార్య ఫోటోకి చేసాడు. అలా రేవంత్ చేసాడు.ఎమోషనల్ గా తనలో తాను మాట్లాడుకున్నాడు. 'కష్టపడి ఆడి గెలిచి .. ఆ కప్పు మా బేబి కి ఇస్తా అని బిగ్ బాస్ కి చెప్పుకున్నాడు' రేవంత్. ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ, 'ఫ్రూట్స్, స్వీట్స్ ఏవైనా పంపి, మీ దీవెనలు, మీ ఆశీస్సులు మీ భార్యకు పంపించండి' అని చెప్పాడు. ఆ తర్వాత తమ తోటి హౌస్ మేట్స్ అందరిని పిలిచి వాళ్ళతో తమ ఆనందాన్ని పంచుకున్నాడు."నా భార్య పేరు అన్విత , నా పేరు రేవంత్ రెండూ కలుపుకొని 'రేవాన్విత' అని మేం అనుకున్నాం" అంటూ ఎమోషనల్ అయ్యాడు రేవంత్. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కలిసి 'కంగ్రాట్స్ టూ రేవాన్విత అని హౌస్ మేట్స్ అందరూ అరుస్తూ' శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్నివేశం అంతా కూడా చాలా హార్ట్ టచింగ్ గా సాగింది. చూసిన ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యిపోయారేమో.
నిన్న జరిగిన మొత్తం ఎపిసోడ్ లో రేవంత్ ది 'హైలైట్ అఫ్ ది డే' గా నిలిచింది. మరి తన బేబీ కోసం రేవంత్ చివరి వరకూ ఉండి విజేతగా నిలుస్తాడో చూడాలి మరి.