English | Telugu
‘ఇంత వయసొచ్చినా గౌన్లు వేసుకుంటోంది’ అంటూ హేమపై ఆది కామెంట్స్
Updated : Sep 30, 2022
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో అలరిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు మంగమ్మ గారి కొడుకు టైటిల్ తో ఈ షో ఆదివారం ప్రసారం కాబోతోంది. ఇందులో నటి హేమ నాటీ నరేష్ కి తల్లిగా నటిస్తుంది. చిన్ని తండ్రి నిను చూడగా అని పాట పాడుతూ భోజనం తినిపిస్తూ ఉంటుంది. హైపర్ ఆది తండ్రి క్యారెక్టర్ లో వచ్చి "ఏంట్రా మీ అమ్మకు 70 ఏళ్లు వచ్చినా ఈ గౌన్లు వేసుకోవడం మానుకోలేదు" అనేసరికి హేమ ఒక సీరియస్ లుక్ ఇచ్చింది ఆది వైపు. ఆది వాళ్ళు వీళ్ళు అని కాదు ఎక్కడంటే అక్కడ లేడీస్ మీద ఇలా చెత్త కామెంట్స్ చేస్తూ తనను తాను బాగా క్రియేటివ్ అన్నట్టుగా ఎక్స్పోజ్ చేసుకోవడం బాగా తెలిసినవాడు కాబట్టి ప్రతీ వారం లేడీస్ మీద కచ్చితంగా ఏదో ఒక కామెంట్ ఇలాంటిది చేస్తూనే ఉంటున్నాడు. ఇక ఈ ఎపిసోడ్ లో విశ్వా అతని వైఫ్ కూడా ఎంట్రీ ఇచ్చారు.
విశ్వా కోసం తన వైఫ్ ఒక సాంగ్ పాడి డేడికేట్ చేసేసరికి "ఇంత మంచి భార్యను ఇచ్చి ఎంతో మంచి పని చేసాడు దేవుడు" అని కంప్లిమెంట్ ఇచ్చాడు. ఇక ఈసారి ఎపిసోడ్ కి నూకరాజు వాళ్ళ నాన్నను తీసుకొచ్చారు. ఆసియా నూకరాజు ప్రేమ విషయం తెలిసిందే. ఇక ఆసియా "మీ అబ్బాయి చూస్తే చాలు అలానే ఉండిపోతా..నాలుగేళ్ల నుంచి అతన్ని చూస్తూనే ఉన్నా" అనేసరికి "నా కొడుకుని నేనే నాలుగు నిమిషాలు కూడా చూస్తలేదు ..నాలుగేళ్ల నుంచి నువ్వెలా చూస్తున్నావమ్మా" అంటూ స్టేజి మీద కౌంటర్ ఇచ్చాడు. వెంటనే ఇమ్మానుయేల్, వర్ష వచ్చి "ప్రేమకు కళ్ళు లేవు అంకుల్ " అనేసరికి "నెత్తి మీద బొచ్చు కూడా లేదు కదమ్మా" అంటూ కౌంటర్ ఇచ్చేసరికి అందరూ నవ్వేశారు. ఇలా పంచ్ డైలాగ్స్ ఈ వారం షో అలరించడానికి సిద్ధంగా ఉంది.