English | Telugu
'భార్యని, పిల్లల్ని ప్రేమించనోడు మనిషా అన్నా!'.. పూరిపై బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్!
Updated : Oct 1, 2022
సందు దొరికితే చాలు ఈమధ్య పూరి జగన్నాథ్ మీద చురకలు వేస్తూ ఉన్నాడు బండ్ల గణేశ్. పూరి కొడుకు ఆకాశ్ హీరోగా నటించిన 'చోర్ బజార్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లిన గణేష్ అక్కడ స్టేజి మీద పూరీపై సెటైర్ల మీద సెటైర్లు వేసాడు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. “పూరి ఎంతోమందిని స్టార్లని చేశాడు కానీ కన్న కొడుకుని స్టార్ ని చేయలేకపోయాడు" అంటూ గణేష్ సెటైర్స్ వేయడం, దానికి కౌంటర్ గా పూరి కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రివర్స్ కౌంటర్ లు వేయడం మనకు తెలిసిన విషయమే.
ఐతే ఇటీవల బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసాడు. "రాజకీయాలను ఎందుకు కెలుకుతున్నార"ని యాంకర్ అడిగేసరికి .. "నేనెక్కడ కెలికాను" అంటూ బండ్ల గణేష్ మాట దాటేశాడు. "పోసానికి చావు మామూలుగాఉండదు అని మీరెలా చెప్తారు?" అని యాంకర్ అడిగేసరికి “నువ్వు పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి. బండ్ల గణేష్ పడడు” అంటూ సమాధానమిచ్చాడు. "అసలు పోసాని గురించి ఆ మాట ఎందుకన్నారు? ఆ ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీయే కదా" అని అడిగేసరికి, “బండ్ల గణేష్ మీద కోపముంటే నన్ను తిట్టు, నన్ను కొట్టు. కానీ మా అమ్మ, నాన్న ఏం చేశారు?” అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు బండ్ల గణేష్.
“మరి పూరీ ఎందుకు స్పందించారు? నాలుక జాగ్రత్తగా పెట్టుకో అని ఎందుకన్నారు?” అని యాంకర్ అడగడంతో ''భార్యని, పిల్లల్ని ప్రేమించనోడు మనిషా అన్నా" అంటూ బండ్ల గణేష్ ఫైర్ అయ్యాడు. “ప్రేమించడం, ప్రేమించకపోవడం ఆయనిష్టం” అని యాంకర్ సమాధానం ఇచ్చి పూరికిఫోన్ చేయబోతే.. “పూరీ అనే వాడికి మంచి, చెడు చెప్పే రైట్ నాకు ఉంది. అతనునా ఫ్రెండ్. నువ్ ఫోన్ పెట్టు ముందు” అంటూ బండ్ల గణేష్ గట్టిగా అరిచేసాడు. ఇక ఈ హాట్ హాట్ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.