English | Telugu
స్టేజి పై ఎమోషన్ ఐన మంత్రి రోజా!
Updated : Oct 3, 2022
రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద తిరుగులేని పేరు తెచ్చుకుని ఇప్పుడు బుల్లి తెర మీద జబర్దస్త్ తో తన మార్క్ వేసిన లేడీ బాస్. ఐతే ఆమె లైఫ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వైపు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉంటూ మరో వైపు పాలిటిక్స్ లో కూడా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఏపీ కేబీనెట్ లో మంత్రిగా కొనసాగుతోంది. ఈ కారణంగా ప్రస్తుతానికి ఈమె టీవీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.
ఐతే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆమె మళ్ళీ స్టేజి పైకి రీ ఎంట్రీ ఇచ్చేసారు. "దసరా వైభవం" పేరుతో మల్లెమాల వాళ్ళు ఒక ఈవెంట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ఈవెంట్ కోసం సినీనటి, ఏపీ మంత్రి రోజా ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అయితే చివర్లో మంత్రి రోజా గారి జీవిత ప్రస్థానం గురించి ఒక స్కిట్ వేసి చూపించారు . అది చూస్తూ.. రోజా ఎమోషనల్ అయ్యారు. “అందరి పిల్లల్లాగే నా పిల్లలు కూడా అమ్మ అన్నం తినిపించాలని అనుకుంటారు. కానీ నేను వెళ్లలేను. అందరికీ కోవిడ్ అనేది ఓ కష్టమైన పిరియడ్ ఐతే నాకు, నా పిల్లలకి మాత్రం అది హ్యాపీయెస్ట్ పీరియడ్” అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అలా ప్రోమో ఎండ్ చేశారు.
ఇంకా రోజా ఏం షేర్ చేసుకున్నారు, ఈ ఎపిసోడ్ లో ఇంకా ఎలాంటి ఇంటరెస్టింగ్ టాపిక్స్ నడిచాయి అనే విషయం తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం దసరా వరకు ఎదురుచూడాల్సిందే.