English | Telugu

Jayam serial : రుద్ర కేసు వాయిదా.. రీక్రియేట్ చేస్తే సాక్ష్యాలు తారుమారు!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -57 లో....శకుంతల తన కొడుకుని చంపేశాడని రుద్రపై కేసు పెడుతుంది. ఆ కేసు కోర్ట్ లో ఫైనల్ హియరింగ్ కి వస్తుంది. రుద్ర తరుపున లాయర్ ప్రేమ్ కోర్ట్ లో చాలా చాకచక్యంగా మాట్లాడతాడు. అసలు శకుంతల కొడుకు భానుప్రతాప్ ని చంపింది వీరు. రౌడీలతో కోర్ట్ లో మాట్లాడతాడు లాయర్ ప్రేమ్. వాళ్ళు ఎలా మాట్లాడిన ఇద్దరు ఒకే సమాధానం చెప్తారు.

ఆ తర్వాత శకుంతలని బోనులకి పిలుస్తాడు లాయర్ ప్రేమ్. మీరు చెప్పండి అమ్మ మీ సొంతకొడుకులాగా పెంచారు. ఇంకా భాను, రుద్ర అన్నదమ్ముల కంటే ప్రాణస్నేహితులాగా ఉన్నారని మీ కుటుంబంలో ఎలాంటి ఆస్తుల గొడవలు లేవంటున్నారు.. మరి రుద్ర ఈ నేరం చేసాడని ఎందుకు అంటున్నారని శకుంతలని ప్రేమ్ అడుగుతాడు. క్షనికావేశం..ఎంతపనినైనా చేయించొచ్చని శకుంతల అంటుంది. రుద్రకి ప్రతికూలంగా సాక్ష్యాలు ఉంటాయి. చామంతితో గంగ మాట్లాడుతుంది. నువ్వు కూడా లాయర్ చదువుతున్నావ్ కదా ఏదైనా ఐడియా చెప్పమని అంటుంది.

ఆ తర్వాత సాక్ష్యాలు అన్ని క్లియర్ గా అనిపించడం లేదు.. నాకు సిచువేషన్ ని రీక్రియేట్ చేస్తే ఏదైనా సాక్ష్యం దొరుకుతుంది.. నాకు పర్మిషన్ ఇవ్వండి అని జడ్జ్ ని ప్రేమ్ రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో జడ్జ్ ఒప్పుకొని కేసుని వాయిదా వేస్తాడు. ఆ తర్వాత చాలా థాంక్స్ ప్రేమ్ అని రుద్ర చెప్తాడు. ఈ ఐడియా చామంతిది అని ప్రేమ్ అంటాడు. తరువాయి భాగంలో భాను చనిపోయినప్పటి సిచువేషన్ ని రీక్రియేట్ చేస్తారు. అందులో గొడవ జరిగినప్పుడు రుద్ర నెట్టేస్తే పడిపోయే సిచువేషన్ లేదు.. ఎవరో తోసేశారని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.