దేవుడికి భక్తుడు భజనే చేస్తాడు అంతకుమించి ఏం చేయలేడు!
"ఎక్స్ట్రా జబర్దస్త్" ఈ వారం మంచి పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయింది. ఇందులో గెటప్ శీను గ్యాంగ్ "గాడ్ ఫాదర్" మూవీ స్పూఫ్ చేశారు. చిరంజీవిగా శీను, సత్యదేవ్ గా ఆటో రాంప్రసాద్, నయనతారగా అన్నపూర్ణ , సల్మాన్ ఖాన్ గా బులెట్ భాస్కర్ ఈ స్కిట్ లో నటించారు.