English | Telugu
హౌస్ లో మొదటిసారిగా ఏడ్చిన గీతు!
Updated : Oct 26, 2022
బిగ్ బాస్ హౌస్ లో ఎన్నడు లేని విధంగా వింతలు జరుగుతున్నాయి అని చెప్పాలి. ఇప్పటివరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండి, ఎలాంటి ఎమోషన్స్ కి తావు ఇవ్వకుండా, మొదటి వారం నుండి పక్కాగా గేమ్ ఆడుతు హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న గీతు ఏడ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
అయితే నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో బిగ్ బాస్ అందరిని రెండు జంటలుగా చేసిన విషయం తెలిసిందే. కాగా "బిగ్ బాస్ లో చాపల వర్షం మొదలవుతుంది. బజర్ మోగిననుండి, తర్వాత బజర్ వచ్చేవరకు ఈ టాస్క్ కొనసాగుతోంది. చాపలు అన్నీ పట్టుకొని వారికి సంబంధించిన బుట్టలో వేసుకోవాలి మరియు వేరే వాళ్ళ బుట్ట నుండి తీసుకోవచ్చు అలాగే వారి బుట్ట ను కాపాడుకోవాలి" అని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు.
కాగా అందరూ చేపలను పట్టుకున్నారు. వారి వారి బుట్టలను కాపాడుకుంటు వస్తున్నోరు. గీతు మాత్రం ఇతరుల బుట్ట నుండి తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా, మిగతా జంటలు కూడా గీతు, ఆదిరెడ్డి జంటల చాపలు తీసుకున్నారు. మొదటి బజర్ పూర్తి అయ్యేసరికి, అందరికంటే తక్కువ ఉన్న గీతు, ఆదిరెడ్డి లను పోటీ నుంచి తొలగించాడు బిగ్ బాస్. కాగా టాస్క్ లో ఓడిపోయినందుకు గీతు మొదటిసారిగా ఏడ్చింది. అప్పుడు మిగతా హౌస్ మేట్స్ అందరు వచ్చి ఓదార్చారు. "నేను చూసినంతవరకు ఎప్పుడు ఏడ్వలేదు. నువ్వు ఏడ్వడం ఫస్ట్ టైం చూస్తున్నా గీతు" అని సూర్య చెప్పాడు. ఎప్పుడు ఏడ్వని గీతు ఏడ్చేసరికి అందరు ఆశ్చర్యపోయారు. గీతు మాట్లాడుతూ, "మీరు గేమ్ లో ఇన్వాల్వ్ అయ్యేలా చెయ్యడానికి మిమ్మల్ని అందరిని కావాలని రెచ్చగొట్టాను" అని చెప్పుకుంటు ఏడ్చేసింది.
మిగతా హౌస్ మేట్స్ గేమ్ ని కంటిన్యూ చేస్తుంటే ఆదిరెడ్డి, గీతు ఇద్దరు ఒక్క పక్కన కూర్చొని బాధపడుతున్నారు. అయితే టాస్క్ లో ఓడిపోయిన వీరిద్దరికి బిగ్ బాస్ ఈ వారం లో ఇంకా ఏమైనా అవకాశం ఇచ్చి టాస్క్ లో పాల్లొనేలా చేస్తాడేమో? చూడాలి