English | Telugu

'నీ వాయిస్ అంటేనే చిరాకు, నీ షాడో అన్న నాకు అసహ్యం' అంటోన్న కీర్తి భట్!

బిగ్ బాస్ నామినేషన్ అంటేనే కంటెస్టెంట్స్ మధ్యలో మాటల యుద్ధం. ఒక్కో కంటెస్టెంట్ చెప్పే కారణాలు, వాళ్ళు అవతలి కంటెస్టెంట్ ని నామినేషన్ చేసే విధానాలు అందరిని ఆకట్టుకుంటాయి. కీర్తి భట్, రేవంత్ కి మధ్య మాటలు మితిమీరిపోయాయి. కీర్తి భట్, రేవంత్ ని నామినేట్ చేసింది.

నామినేట్ చేసాక కీర్తిభట్ మాట్లాడుతూ, "అన్న, నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం వాయిస్ ఎక్కువగా చేసి మట్లాడుతావ్. అది నేను తీసుకోలేకపోతున్నాను. ఇదే విషయం చెప్పినా నువ్వు వినట్లేదు. నాకు నచ్చలేదు నువ్వు అలా మాట్లాడటం" అని రేవంత్ తో కీర్తి భట్ చెప్పింది. ఆ తర్వాత రేవంత్ మాట్లాడుతూ, "నా వాయిస్ ఏ అంత. ఎవరో నా మీద నామినేషన్ వేసారు అని నువ్వు నన్ను నామినేట్ చేస్తా అంటే కుదరదు. తుప్పాస్ రీజన్స్ కి నామినేట్ చేయడం ఏంటి" అని రేవంత్ అన్నాడు.

"ఒకరు ఏమైనా చెప్పినప్పుడు వినాలి ముందు. కానీ అది నువ్వు పాటించవు. అందరికి రూల్స్ చెప్తావు. కానీ నువ్వు ఫాలో అవ్వవు. నాకు అందుకే నీ వాయిస్ అంటే అసహ్యం. నీ షాడో తగిలిన చిరాకు" అంటు రేవంత్ తో కీర్తి భట్ చెప్పుకొచ్చింది. దానికి సమాధానంగా, " ప్రతీసారీ నామినేషన్లో నీతో పడలేకపోతున్నా, ఏం తెలియకుండా నామినేట్ చేస్తావ్. ఒక ఆలోచన లేదు. థింకింగ్ లేదు. నీతో మాట్లాడటం అంటేనే చిరాకు. అసహ్యం" అని రేవంత్ చెప్పాడు. "నా మాట గురించి నువ్వు చెప్పకర్లేదు. ఐ నో వెరీ వెల్ ఎబోట్ ఇట్" అని కీర్తి భట్ అనగా, "అసలు నువ్వు నా గురించి మాట్లాడక్కర్లేదు" అని రేవంత్ కోపంగా వెళ్ళిపోయాడు. అలా రేవంత్ కి , కీర్తి భట్ కి మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగింది.

అయితే ప్రతీ వారం నామినేషన్లో ఉంటు వస్తోన్న రేవంత్. ఈ సారి కూడా సేవ్ అవుతాడు అని ప్రేక్షకులు భావిస్తోన్నారు. అయితే కీర్తి భట్ కి మాత్రం ఈ వారం ఎలిమినేషన్ తప్పేలా లేదు అనిపిస్తోంది.