English | Telugu

ఇనయాను ఫేక్ అంటోన్న ఆదిరెడ్డి!

బిగ్ బాస్ లో సోమవారం అంటే నామినేషన్ గుర్తొస్తుంటుంది చూసే ప్రేక్షకులకు ఎందుకంటే ఆదివారం జరిగే సండే ఫండే ఎంజాయ్ కంటే కూడా నామినేషన్ నే ఎక్కువ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నామినేషన్లో కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ అలాంటిది మరి.

ఆదిరెడ్డి, ఇనయాని నామినేట్ చేసాడు. కారణం చాలా క్లారిటీ గా వివరించాడు. "నువ్వు రెండు రోజుల ముందు శ్రీహాన్ ని నామినేట్ చేసి, ఆ తర్వాత 'ఫార్ బెటర్ దెన్ ఎనీవన్' అని శ్రీహాన్ కి చెప్పడం నాకు అన్ ఫెయిర్ గా అనిపించింది" అని ఆదిరెడ్డి చెప్పాడు. "అలా నాకు అనిపించింది కాబట్టి చెప్పాను" అని ఇనయా సమాధానమిచ్చింది. అయితే "గత వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో నాకు 'జగదేకవీరుడు అతిలోకసుందరి' మూవీలోని ఇంద్రజ పాత్ర ఇచ్చారు. నాకు ఆ మూవీ తెలియదు. నాకు క్లోజ్ ఫ్రెండ్ అయిన సూర్యని అడిగినా కూడా చెప్పలేదు. కానీ నాకు శ్రీహాన్ అర్థం అయ్యేలా వివరించాడు. అందుకే చెప్పా, నువు నన్ను నామినేట్ చేసావని నిన్ను చేశాను. అంతేగాని నీ మీద నాకు ఏం కోపం లేదని, 'ఫార్ బెటర్ దెన్ ఎనివన్ ఇన్ థిస్ హౌస్' అని శ్రీహాన్ తో చెప్పాను. అందులో ఏం తప్పులేదు" అని ఇనయా ఆదిరెడ్డితో చెప్పుకొచ్చింది.

"ఒక్కొక్క సిట్యువేషన్ లో, ఒక్కోలా బిహేవ్ చేస్తున్నట్లు అనిపించింది. అందుకే నువ్వు ఫేక్ గా ఉంటున్నట్టు అనిపిస్తోంది‌. నీ గేమ్ పూర్తిగా తగ్గిపోయింది. మొదట బాగా పర్ఫామెన్స్ చేసిన నువ్వు డైవర్ట్ అవుతున్నట్టుగా అనిపించి, నువ్వు బాగా పర్ఫామెన్స్ చేయాలని నామినేట్ చేస్తున్నా " అని ఆదిరెడ్డి, ఇనయాతో అన్నాడు. దానికి సమాధానంగా ఇనయా మాట్లాడుతూ, " నేను ఇలానే ఉంటాను. సిట్యువేషన్ కి తగ్గట్టుగా ఉంటాను. ఇంకా నా గేమ్ మార్చుకుంటాను. తర్వాత ఫేక్ గా నేను ఉండటం లేదు అని ఇనయా, అనగా "ఫేక్ గా ఉండటం కూడా ఒక స్ట్రాటజి. దానిని నేను తప్పు పట్టను" అని ఆదిరెడ్డి అనగా, " నా ఆలోచనలు కూడా మీరెలా అనుకుంటారు. అయినా నేను ఫేక్ కాదు. అది స్ట్రాటజీ అయితే ఒకే పర్వాలేదు" అని ఇనయా అంది.

హౌస్ లో మొదటి వారం నుండి ఆదిరెడ్డి ఇనయాలకు ఎలాంటి గొడవలు లేవు. కాగా ఈ మధ్యలో ఇనయా డ్యూయల్ రోల్ ప్లే చేస్తుండటంతో ఎవ్వరికి నచ్చట్లేదు అనే చెప్పాలి. మొదటి రెండు వారాలు సూపర్ అనిపించిన ఇనయా, ప్రస్తుతం ఫ్లాప్ గా పేరు తెచ్చుకుంటోంది. రాబోయే రోజుల్లో అయిన మంచి పర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందో? లేదో ? చూడాలి.