English | Telugu

సూర్య, ఇనయా మధ్య మాటల యుద్ధం!

బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ గొడవలు ఉంటేనే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు ప్రేక్షకులు. కాగా నామినేషన్ కోసం వారం అంతాఎదురుచూస్తారు అనడంలో ఆశ్చర్యమే లేదు. కాగా సోమవారం జరిగిన నామినేషన్ ఉత్కంఠభరితంగా సాగింది. అందులో ముఖ్యంగా సూర్య, ఇనయాని నామినేట్ చెయ్యడం, ఇనయా, సూర్య ను నామినేట్ చేయడం. ఇనాయ నామినేషన్ అంటే ఒక్క మాటలు యుద్ధం అనే చెప్పాలి. ప్రతిసారి ఒకరికొకరు నామినేట్ చేసుకోవడం వింతేమీ కాదు. కానీ ఈ సారి కొత్తగా శ్రీహాన్ ని కాకుండా సూర్య ని నామినేట్ చేయడం, మొదటిసారిగా ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఇనయ, సూర్య ల మధ్య సాగుతోన్న రిలేషన్ షిప్ కాస్త ముగిసినట్టుగా ఉంది. 'సూర్య నా క్రష్' అని ఇనయా కన్ఫెషన్ రూంలో చెప్పడంతో నాగార్జున కూడా అనుకున్నాడు. అలాగే హౌస్ మేట్స్ కూడా వీళ్లిద్దరి మధ్యలో ఏదో జరుగుతోంది అని అనుకోవడం మాములుగా మారింది. "దీనివల్ల సూర్య మన ఇద్దరి గేమ్ డిస్టర్బ్ అవుతోందని, నాకు కొంచెం దూరంగా ఉండడం మంచిది" అని చెప్పింది.

ఆ తర్వాత ఇనయా మాట్లాడుతూ, "నువ్వు అందరికి సోప్ వేస్తావ్. ఇక్కడ ఎవరితో నీకు ఆర్గుమెంట్ లేదు. కత్తితో ఇలా పొడిచేసి, మళ్ళీ దానిమీద పౌడర్ రాస్తావ్. నీ గురించి బాగా తెలిసింది నాకు" అని ఇనయా అంది. "ఇకనుంచి మంచిగా ఉండటం మహా పాపం" అని సూర్య చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇనయా, శ్రీహాన్ ని నామినేట్ చేసింది. "నీకు ఆల్రెడీ సిరి ఉంది. నేను నీకు కేక్ చేసానని అందరు వేరేలా అనుకోవడం. నాకు నచ్చట్లేదు. ఆలా ఏం లేదు అని చెప్పడం కోసమే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా" అని శ్రీహాన్ నామినేట్ చేసింది. దానికి "అది హౌస్ మేట్స్ కి చెబితే సరిపోద్ది కదా. అలా చెయ్యకుండా నన్ను నామినేట్ చేయడం ఎందుకు" అని శ్రీహాన్ అన్నాడు.

ఇనయా రెండవ నామినేషన్ గా సూర్యని చేసింది. "నీకు ఆల్రెడీ బుజ్జమ్మ ఉంది. నేను నీకు ఒక ఫ్రెండ్ మాత్రమే. హౌస్ మేట్స్ వేరేలా అనుకుంటున్నారు. అది బయటకు వేరేలా పోర్ట్రేట్ అవుతే బాగుండదు అని చెప్పింది. నీకు నాకు మంచి బాండింగ్ ఉంది. ఒక స్నేహం మాత్రమే. ఇక నుండి నిన్ను ఒక హౌస్ మేట్ గా చూస్తా అంతే" అని‌ ఇనయా, సూర్య తో చెప్పింది. ఇక ముందు హౌస్ లో వీళ్ళు ఫ్రెండ్స్ గా ఉంటారో హౌజ్ మేట్స్ గా ఉంటారో చూడాలి.