English | Telugu
నోటిదూల లేకపోతే ఎవరూ మనల్ని పట్టించుకోరు
Updated : Oct 25, 2022
జబర్థస్త్ షో ఆడియన్స్ ని ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. లేటెస్ట్ గా జబర్ధస్త్‌కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇక ఇందులో ఆది, కృష్ణ భగవాన్ వీల్ చెయిర్ లో వస్తారు. అప్పుడు కృష్ణ భగవాన్ "వీల్ చెయిర్ ని తోయకుండా నన్ను తోస్తావేంటని అడిగేసరికి దానికి ఆది.. మిమ్మల్నయినా అది తోస్తోంది, ఇదైతే నా వెనక ఏదేదో చేస్తోంది" అని అన్నాడు. "ఇక ఇంద్రజ గారితో వర్క్ చేస్తున్నారుగా, అది ఎలా ఉందో" అని ఆది అడిగేసరికి " ఆవిడకేంటి, ఎప్పుడూ ఎవర్ గ్రీన్, గ్రీన్ సారి, గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుని రావడం చాలా బాగుంటుంది" అని కృష్ణ భగవాన్ అంటే దానికి పంచ్‌గా ఆది "అలా ఎవర్‌గ్రీన్ అంటారా" అని అన్నాడు. దానికి అందరూ నవ్వేశారు.
"మన ఎదురుగా తమన్నా, పూజా హెగ్డే వెళితే మీరు ఎవరిని చూస్తారు" అని ఆది అడిగేసరికి " నేను తమన్నాని చూస్తా" అని కృష్ణ భగవాన్ అన్నాడు . "ఏంటి సార్ నేనైతే ఇద్దరిని చూస్తా " అని ఆది అనడంతో "నేను అంత కక్కుర్తి పొజిషన్ లో లేను" అని అన్నాడు. "మన బాడీలో అన్ని పడిపోయి నోరు ఒక్కటే ఎందుకు వదిలేసాడో" అని ఆది అనేసరికి అప్పుడు కృష్ణ భగవాన్ "నాకు నోటిదూల ఉంది కాబట్టి" అని పరువు తీసాడు. "నోటి దూల ఉంటే తప్పు అంటారా" అనేసరికి " అది లేకపోతే తప్పుకోండని మనని అంటారు" అంటూ కృష్ణ భగవాన్ పంచ్‌లు వేశాడు.