English | Telugu

మనిషిని తప్ప అన్నీ తింటాడు

బ్రహ్మి - ఆలీ ఈ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎంత సూపర్ డూపర్ హిట్టో అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు చాన్నాళ్లకు వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఎంటర్టైన్ చేసింది. చెఫ్ మంత్ర సీజన్ - 2 లో వీరిద్దరూ అక్టోబర్ 28 న కనిపించి అలరించబోతున్నారు. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ‘‘ఆలీ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి?’’ అని బ్రహ్మానందాన్ని లక్ష్మి అడిగేసరికి "మనిషిని తప్పా అన్నీ తింటాడు" అని ఫన్నీ ఆన్సర్ చెప్పారు. ఇక వీళ్ళ ఇద్దరికీ దోశెలు వేసే పోటీ పెట్టింది. అది కూడా స్పీడ్ గా వేయాలి, అందంగా వేయాలని కండిషన్ పెట్టింది. ‘‘మిరపకాయ ఈజ్ ఈక్వల్ టూ గుంటూరు.. గుంటూరు ఈజ్ ఈక్వల్ టూ బ్రహ్మారందరావు’’ అని బ్రహ్మానందం కామెడీ డైలాగ్ చెప్పబోయి అచ్చు తప్పు చెప్పేసరికి వెంటనే లక్ష్మి ‘‘బ్రహ్మారంధ్రమా’’ అని పంచ్‌ వేసింది.

"బోటీ కూర, లివర్ కూర, తలకాయ కూర " అని లక్ష్మీ ఏదో ప్రశ్న అడగడానికి ట్రై చేస్తుండగా మధ్యలో బ్రహ్మానందం అందుకుని ‘‘తలకాయ లేనోళ్లే.. తలకాయ కూర తింటారు’’ అని పంచ్‌ వేశారు. ఇక ఫైనల్ గా షోకి వచ్చిన గెస్టుల ఎదురుగా వాళ్లకు ఏమీ పెట్టకుండా లొట్టలేసుకుని మరీ డెలీషియస్ ఫుడ్ తినేసింది మంచు లక్ష్మి. "షోకి పిలిచి మనకు పెట్టకుండా అలా తినేస్తుందేమిటి" అని బ్రహ్మానందం చాలా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే వీళ్ళ కామెడీ ఫుడ్ షో ఆడియన్స్ లో జోష్ నింపబోతోంది.