English | Telugu

ఎవడ్రా నవ్విందక్కడ..కం టు మై రూమ్

"క్యాష్" ప్రోగ్రాం ఈ వారం ఫుల్ మస్తీ చేయడానికి రెడీ అయ్యింది. ఇక ఈ లేటెస్ట్ షోకి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. జెనరల్ గా మాట్లాడుకునే పదాలనే సినిమా టైటిల్స్ గా పెడుతుండేసరికి కొంత కంఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతోంది. ఇప్పుడు అలాంటి ఒక టైటిల్ తో నవంబర్ 4 న రిలీజ్ కాబోతున్న like share subscribe మూవీ టీమ్ క్యాష్ షోలో సందడి చేశారు. ఈ షోకి మూవీ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ఫారియా అబ్దుల్లా, డైరెక్టర్ మేర్లపాక గాంధీ, యాక్టర్స్ బ్రహ్మాజీ, సుదర్శన్ పాల్గొన్నారు. ఇలా చాలా మంది సెలెబ్రెటీలు సెలబ్రిటీలు మూవీ రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ లో భాగంగా క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఇక ఈ మూవీ టీమ్ కు సుమ గ్రాండ్ వెల్కం చెప్పారు. నటుడు బ్రహ్మాజీ పై సుమ కనకాల వేసిన పంచ్ లు వింటే కడుపుబ్బా నవ్వాల్సిందే. "చూసారా బ్రహ్మాజీ పక్కన ఫరియా ఎంత సూట్ అయ్యిందో " అని ఇద్దరి ఫోటో చూపించేసరికి బ్యాక్ గ్రౌండ్ లో ఎవరో గట్టిగా నవ్వారు.

దాంతో బ్రహ్మాజీకి కామెడీ కోపం వచ్చేసింది..దాంతో "ఎవడ్రా నవ్విందక్కడ, కం టు మై రూమ్" అనేసరికి స్టేజి మొత్తం నవ్వులతో నిండిపోయింది. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే.. సంతోష్ శోభన్ ను హీరోగా ఎలివేట్ చేసే మరో మూవీ అని చెప్పొచ్చు. జాతిరత్నాలు సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవలే సినిమా ట్రైలర్ ను హీరో ప్రభాస్ రిలీజ్ చేశారు.