English | Telugu
ఆమె పొద్దుతిరుగుడు పువ్వు.. ఆయన ప్రకాష్ రాజ్!
Updated : Oct 25, 2022
బిగ్ బాస్ హౌస్ లో ఆది ఒక్కొక్కరి ఆట తీరు గురించి వర్ణిస్తూ చెబుతూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు. అందరినీ నవ్వించాడు. ఇక హైపర్ ఆది.. ఇనయా గురించి చెప్తూ "హౌస్ లో ఎవరు మైక్ పెట్టుకున్నా పెట్టుకోక పోయిన బిగ్ బాస్ అరుస్తాడేమో కానీ ఈమె పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బిగ్ బాస్ ఏమీ అనడు. ఎందుకంటే మాములుగా మాట్లాడితేనే అందరికీ వినిపిస్తుంది. కిక్ సినిమాలో ఇలియానా రవితేజ కోసం బ్రహ్మానందాన్ని అడ్డుపెట్టుకున్నట్టు ఈ హౌస్ లో సూర్యని పడేయడానికి శ్రీహన్ ని అడ్డుపెట్టుకుంది ఇనయా.. మాములుగా ఐతే ఇనయ కానీ నామినేషన్స్ వచ్చాయంటే మాత్రం నేను విననయ్యా అంటుంది. ఇప్పటి వరకు నీ గ్రాఫ్ చాలా బాగుంది. ఐతే కొంచెం మార్చుకోవాలి. ఇలా ఎవరిని బడితే వాళ్ళను మార్చకుండా గేమ్ మీద ఇంటరెస్ట్ పెట్టు. స్వర్గం నుంచి నువ్వు ఇంద్రజలా వచ్చినప్పుడు శ్రీహాన్ కే కాదు మా అందరికీ బాగా నచ్చేసావ్." అన్నాడు ఆది.
ఇనయాకి హౌస్ లో పొద్దుతిరుగుడు అనే ముద్దు పేరు ఉంది అని హోస్ట్ నాగ్ చెప్పారు. ఆది తర్వాత రేవంత్ గురించి చెప్తూ "ఎవరైనా రాని, ఏవైనా కానీ తగ్గేదేలే అన్నావు చూడు ఆ డైలాగ్ టైంలో నీలో పుష్ప కనిపించలేదు ప్రకాష్ రాజ్ కనిపించాడు. ఎవరికైనా గేమ్ మధ్యలో కోపం వస్తుంది కానీ నీ విషయంలో కోపం మధ్యలో గేమ్ వచ్చి వెళ్తుంది అంటూ పంచ్ వేసేసరికి అందరూ నవ్వేశారు. ఇంట్లో అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్ని పనులు చేస్తోంది నువ్వే. పెళ్లయింది కాబట్టి అన్ని చూసుకుని ఆడుకోవాలి..లేదంటే ఇక్కడ టైటిల్ గెలిచినా ఇంటికి వెళ్ళాక కొడతారు" అంటూ రేవంత్ ని హెచ్చరించాడు.