ఢీ 15ని వదిలి ఎక్కడికీ వెళ్ళేది లేదు.. ఇక పాతుకుపోవడమే!
ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ఎపిసోడ్ మంచి ఎంటర్టైనింగ్ గా, జోష్ గా, కలర్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది. టీం ఏ- టీం బిగా కంటెస్టెంట్స్, మాస్టర్స్ డివైడ్ అయ్యారని హోస్ట్ ప్రదీప్ చెప్పాడు. అలాగే 12 మంది కంటెస్టెంట్స్, 12 మంది కొరియోగ్రాఫర్స్ ఉంటారు అని జడ్జి శేఖర్ మాస్టర్ చెప్పారు. అలాగే ఇప్పుడు వేసే మార్క్స్ అన్నీ కూడా ఎలిమినేషన్ రౌండ్ లో టాలీ చేసి ఎవరికి మార్క్స్ తక్కువ వచ్చాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని ఈ షోకి సంబందించిన రూల్స్ చెప్పేసారు...