English | Telugu

ఢీ 15ని వదిలి ఎక్కడికీ వెళ్ళేది లేదు.. ఇక పాతుకుపోవడమే!

ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ఎపిసోడ్ మంచి ఎంటర్టైనింగ్ గా, జోష్ గా, కలర్ ఫుల్ గా స్టార్ట్ అయ్యింది. టీం ఏ- టీం బిగా కంటెస్టెంట్స్, మాస్టర్స్ డివైడ్ అయ్యారని హోస్ట్ ప్రదీప్ చెప్పాడు. అలాగే 12 మంది కంటెస్టెంట్స్, 12 మంది కొరియోగ్రాఫర్స్ ఉంటారు అని జడ్జి శేఖర్ మాస్టర్ చెప్పారు. అలాగే ఇప్పుడు వేసే మార్క్స్ అన్నీ కూడా ఎలిమినేషన్ రౌండ్ లో టాలీ చేసి ఎవరికి మార్క్స్ తక్కువ వచ్చాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారని ఈ షోకి సంబందించిన రూల్స్ చెప్పేసారు.

ఇక ఈ షోలో జడ్జెస్ జడ్జిమెంట్ తో పాటు తోటి మాస్టర్స్ జడ్జిమెంట్ ని కూడా పరిగణలోకి తీసుకుంటాం అన్నారు. ఇక ఇది వరకు లాగే ఆది వచ్చి తన మాటలతో ఎంటర్టైన్ చేసాడు. ఇక మొన్నటి వరకు జడ్జిగా శ్రద్దాతో పాటు పూర్ణ ఉండేది. కానీ ఇప్పుడు పూర్ణ పెళ్ళై వెళ్ళిపోయింది. ఇక జడ్జెస్ గా శేఖర్ మాస్టర్, శ్రద్ద దాస్ మాత్రమే కనిపిస్తున్నారు. "శేఖర్ మాస్టర్ మీరే చాలామందికి ఇన్స్పిరేషన్.. ఇక ఈ షో నుంచి మీరు ఇకముందు వెళ్ళరుగా ఉంటారుగా" అని ప్రదీప్ అనేసరికి "సమస్యే లేదు..పాతుకుపోవడమే" అని జోక్ చేశారు.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.