English | Telugu

గూగుల్ తల్లి చెప్పిన బిగ్ బాస్ విన్నర్ రోహిత్!

బిగ్ బాస్ సీజన్-6 లో రోజు రోజుకి అంచనాలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి దాకా రేవంత్ టైటిల్ విన్నర్ అవుతాడు అని అనుకున్నారంతా.. కానీ ఇప్పుడు తాజాగా ఈ రేస్ లోకి రోహిత్ వచ్చాడు.

బిగ్ బాస్ లో రోహిత్ ప్రస్థానం యునిక్. ఎవరితో గొడవలు లేవు. ఎవరికీ నచ్చకపోవడానికి పెద్దగా రీజన్స్ కూడా లేవు. అయితే బిగ్ బాస్ కి రాకముందు రోహిత్ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడయితే బిగ్ బాస్ లోకి వచ్చాడో.. తన రూటే సపరేట్ అయ్యింది. మొదట్లో మెరీనా-రోహిత్ ఇద్దరు కలిసి ఆడినప్పుడు పెద్దగా కనిపించలేకపోయాడు. కానీ ఎప్పుడయితే మెరీనా బయటకొచ్చిందో, అప్పటి నుండి రోహిత్ తనని తాను మల్చుకుంటూ వచ్చాడు. హౌస్ లో అందరితో బాగా క్లోజ్ అయ్యాడు. తన మాటతో, ఆటతో, నిజాయితీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. నాగార్జున కూడా పలుసార్లు రోహిత్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పాడు. అటు హౌస్ మేట్స్, ఇటు ప్రేక్షకులు రోహిత్ కి జెంటిల్ మ్యాన్, మిస్టర్ పర్ఫెక్ట్, కూల్ అంటూ పేర్లు కూడా పెట్టి హైలైట్ చేసారు. అనఫీషియల్ ఓటింగ్ ప్రకారం స్వల్ప ఓట్ల తేడాతో రోహిత్, రేవంత్ మొదటి స్థానానికి పోటీ పడుతున్నారు.

అయితే బిగ్ బాస్ ముగియడానికి ఇంకా అయిదు రోజుల సమయం ఉన్నా.. గూగుల్ లో 'బిగ్ బాస్ సీజన్-6 విజేత ఎవరు' అని సెర్చ్ చేయగానే రోహిత్ పేరు రావడంతో అందరు ఆశ్చర్యపోయారు. ప్రేక్షకులు హ్యాపీగా సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది. మరి అతను నిజంగానే టైటిల్ గెలుస్తాడో.. లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.