English | Telugu

త్రోబ్యాక్ ఫోటో.. ఆమెకు నిజంగానే పెళ్లయిందా?

ఇనాయ సుల్తానా..బిగ్ బాస్ సీజన్ 6 లో పెద్ద ఆటంబాంబు. ఈ బోల్డ్ లేడీ తన గేమ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. అమ్మాయిలు అంటే అలానే ఉండాలి అనే విధంగా గేమ్ ఆడి చూపించింది. కంటెస్టెంట్ సూర్య అంటే ఇష్టమని నేరుగా బిగ్ బాస్ కే చెప్పేసింది ఇనాయ. ఎలాంటి ఎమోషన్ ని ఐనా వెంటనే ఎక్సప్రెస్ చేసేస్తుంది. అలాంటి ఇనాయ14వ వారం ఎలిమినేట్ ఐపోయింది. మూడు నెలలు బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఇనయా బయటకు వచ్చిన వెంటనే తన క్రష్ సూర్యను, ఫ్రెండ్ వాసంతిని కలిసింది. అలా వాళ్ళతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసేసరికి అవి ఫుల్ వైరల్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఇనాయకి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. అదే ఆమెకు గతంలో పెళ్లి అయ్యింది అని. తనకు ఎన్నో ఏళ్ళ క్రితం పెళ్లి ఐన ఫోటో ఒకటి త్రో బ్యాక్ మెమోరీస్ ద్వారా బయటికి వచ్చింది. ఇక ఆ ఫోటోలో ఆమె పెళ్ళికూతురి ముస్తాబుతో కనిపించింది. ఐతే ఆమెకు అసలు పెళ్లి నిజంగానే అయ్యిందా,లేదా? అంటూ ఆడియన్స్ ఆరా తీస్తున్నారు. ఐతే ఇది పెళ్లి ఫోటోనాలేక ఇంకా ఏదైనా ఫంక్షన్ కి రెడీ ఐన ఫోటోనా అనే విషయం మాత్రం క్లారిటీ లేదు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.