English | Telugu
ఘనంగా 'కోడలా కోడలా కొడుకు పెళ్ళామా' హీరోయిన్ వివాహ వేడుక
Updated : Dec 15, 2022
ఒకప్పుడు బుల్లితెర మీద ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ అనే సీరియల్ ఒక రేంజ్ లో సక్సెస్ సాధించి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. హిందీలో సూపర్ హిట్ అయిన సీరియల్ ‘సాథ్ నిబానా సాథియా’ని తెలుగులో అనువదించారు. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ని రేటింగ్ ని సొంతం చేసుకుంది ఈ సీరియల్.
ఇక ఈ సీరియల్ లో గోపిక పాత్రలో నటించిన దెవోలీనా భట్టాచార్జీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక ఇంటిదయ్యింది. రీసెంట్ గా ఆమె హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి అన్ని ఫంక్షన్స్ ని అలాగే తన ప్రీ వెడ్డింగ్ - వెడ్డింగ్ మూమెంట్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసుకుంది. లోనావాలాలో ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఇక ఈమె ఫేమస్ జిమ్ ట్రైనర్ షోనుని వివాహం చేసుకున్నట్లు అని చెప్తూ ఆ ఫొటోస్ ని ఫాన్స్ కోసం షేర్ చేసింది.