English | Telugu
'బిగ్ బాస్-7' హోస్ట్ గా బాలకృష్ణ!
Updated : Dec 15, 2022
బిగ్ బాస్ తెలుగు సీజన్-6 క్లైమాక్ కి చేరుకుంది. ఓ వైపు ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే చర్చలు జరుగుతుంటే, మరోవైపు నెక్స్ట్ సీజన్ కి కొత్త హోస్ట్ అంటూ ప్రచారం మొదలైంది. బిగ్ బాస్-7 కి నాగార్జున స్థానంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వచ్చే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది.
బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లకు జూనియర్ ఎన్టీఆర్, నాని హోస్ట్ లుగా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. మూడు, నాలుగు సీజన్లకు రికార్డు స్థాయిలో రేటింగ్స్ నమోదు కాగా.. ఐదో సీజన్ నుంచి జోరు తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా ఈ ఆరో సీజన్ కి ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ లభించడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో నాగార్జున షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ నుంచి హోస్ట్ గా తప్పుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్ నిర్వాహకులు సైతం.. గత నాలుగు సీజన్లుగా నాగార్జునే హోస్ట్ గా చేస్తుండటంతో.. ఈసారి కొత్త హోస్ట్ ని రంగంలోకి దించడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 'అన్ స్టాపబుల్' షోతో సంచలనం సృష్టిస్తున్న బాలకృష్ణను బిగ్ బాస్-7 కి హోస్ట్ గా తీసుకురావడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.