English | Telugu

చాలా సాధారణ జీవితం నాది...నా జీతం చిన్నారి కాన్సర్ పేషెంట్స్ కి ఇస్తుంటాను

"ఇంటింటి గృహలక్ష్మి" సీరియల్ తో కస్తూరి బుల్లితెర మీద ఫుల్ ఫేమస్ అయ్యింది. అందులో తులసి పాత్రలో కస్తూరి పడే కష్టాలు చూసి చాలామంది లేడీ ఫ్యాన్స్ ఫీలైపోతుంటారు. ఇక ఈమె నాగార్జున నటించిన ‘అన్నమయ్య’ సినిమాలో ఒక హీరోయిన్ గా చేసింది.. అలాగే ‘పరంపర’ అనే వెబ్ సిరీస్ లో ఒక బోల్డ్ క్యారెక్టర్ కూడా చేసింది. ఇక ఈమె ఇన్ స్టా పోస్టులు చూస్తే.. ఈమె అందం ముందు యంగ్ బ్యూటీస్ ఎవరూ సరిపోరని అనిపిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. రీసెంట్ గా ఆమె చెన్నై మెట్రోలో ప్రయాణిస్తూ తన ఫోన్ పారేసుకుంది. దీని గురించి మెట్రో అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వెంటనే ఆమె ఫోన్ ని వెతికి తీసుకొచ్చి ఇచ్చారు. దీంతో కస్తూరి తెగ మురిసిపోయింది.. చెన్నై మీద, అక్కడి ఆఫీసర్స్ మీద తనకు మంచి రెస్పెక్ట్ ఉందని చెప్తూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

ఇక ఇదంతా చూసిన ఒక నెటిజన్.. ‘మీలాంటి వాళ్లకు సొంతంగా కార్లుంటాయి కదా ..వాటిల్లో వెళ్తే ఫోన్ పారేసుకుని అవకాశమే ఉండదు కదా..మరి ఎందుకు ఇదంతా ఎందుకు పబ్లిసిటీ కోసమా ?’ అని ట్వీట్ చేశాడు. దీనిపై కస్తూరి రెస్పాండ్ అవుతూ ‘నాకు కారు, ఏసీ, టీవీ ఇలా ఎలాంటి ఖరీదైన వస్తువులు లేవు . నేను ఓ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాను’ అని రీట్వీట్ చేసింది. అలాగే మీరు సంపాదించే డబ్బులు ఎం చేస్తారు అని మరో నెటిజన్ అడిగేసరికి ‘నేను సంపాదించింది అంతా మెడికల్ హెల్ప్ అవసరమైన చిన్నారి క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఖర్చు పెడతాను’ అని చాలా జనరల్ గా హార్ట్ టచింగ్ గా ఆన్సర్ చేసింది. ఆమె నవ్వులాగే ఆమె జవాబు కూడా ఉంది అంటున్నారు ఆమె ఫాన్స్.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.