English | Telugu

నైట్ టైం వీడియో కాల్స్ మాట్లాడుతున్నా అందుకే అంత జ్ఞానం వచ్చేసింది!

స్మాల్ స్క్రీన్ మీద రోజు రోజుకు ఎన్నో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా అలా స్టార్ట్ అయ్యిందే ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ ఒకరికి ఒకరు అనే ప్రోగ్రాం. యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో నటుడు శివబాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జెస్ గా ఉన్నారు. ‘మిస్టర్ అండ్ మిస్సెస్’ కాబట్టి.. ప్రతి ఎపిసోడ్ లో రియల్ జంటలతో పాటు రీల్ జంటలు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్స్ తో పాటు జబర్దస్త్ కమెడియన్స్ కూడా వచ్చి ఈ షోలో సందడి చేస్తూ ఉంటారు.

ఈటీవీలో ప్రతి మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఇక ఇప్పుడు వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి సరికొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా హోస్ట్ శ్రీముఖి రచ్చరచ్చ చేసేసింది. సీరియల్ నటి శ్రీవాణి భర్తపై.. కమెడియన్ రాకింగ్ రాకేష్ పై డబుల్ మీనింగ్ పంచ్ డైలాగ్స్ వేసేసింది. ఆఖరికి జడ్జిలు శివబాలాజీ, స్నేహ ‘లవ్ గేమ్స్’ అనంటే.. "అమ్మానాన్న ఆటలు" అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోయింది.

"నీకు అంత నాలెడ్జి ఎలా వచ్చింది అని శ్రీవాణి భర్త అడిగేసరికి ఈమధ్య నేను కూడా నైట్ టైం వీడియో కాల్స్ మాట్లాడుతున్నా అందుకే చాలా జ్ఞానం వచ్చేసింది" అని పంచ్ డైలాగ్ వేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.