English | Telugu

Bigg boss 9 Telugu: హౌస్ లో టాప్-3, బాటమ్-3 ఎవరంటే!

బిగ్ బాస్ సీజన్-9 తెలుగు మొదలై అప్పుడే రెండు వారాలైంది. సెకెండ్ వీక్ లో‌ కంటెస్టెంట్స్ ఆట రెట్టింపు అయింది. ఇమ్మాన్యుయల్, తనూజ ఎమోషనల్ అవ్వడం.. రీతు ప్లాన్ వల్ల డీమాన్ పవన్ కెప్టెన్ అవ్వడం.. రీతూని, డీమాన్ పవన్, ని ఫ్లోరా సైనీని నాగార్జున తిట్టడం.. ఇవన్నీ ఆడియన్స్ కి ఫుల్ ప్యాక్ మిక్స్ డ్ ఎమోషన్స్ ని ఇచ్చాయి.

బిగ్ బాస్ హౌస్ లో సొంతంగా గేమ్ ప్లాన్ చేసినా కూడా వారు గేమ్ ఆడకపోతే హౌస్ నుండి బయటకి రావాల్సిందే. మర్యాద మనీష్ ది అలాగే జరిగింది. తను సరిగ్గా ఆడకుండా భరణిని స్నేక్ అని నోటికొచ్చినట్టు వాగాడు. అతని ఆటతీరుని చూస్తే కామన్ మ్యాన్ కాదు.. బయటున్న లోపలున్నా ఒకటే అనిపించింది. నామినేషన్ ముగిసేసరికి ఫ్లోరా సైనీ, మర్యాద మనీష్ ఉండగా మర్యాద మనీష్ ని ఎలిమినేషన్ గా ప్రకటించాడు నాగార్జున. ఇక స్టేజ్ మీదకి వచ్చిన మనీష్ ఇంకా షాక్ లోనే ఉన్నానని చెప్పాడు. ఇక హౌస్ లో ఎవరు టాప్-3, ఎవరు బాటమ్-3 అని మర్యాద మనీష్ ని నాగార్జున అడిగాడు.

సుమన్‌శెట్టి, ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజలు తమ ఆటతీరును మెరుగుపరచుకోవాలని సూచిస్తూ వారిని బాటమ్-3లో ఉంచాడు. ఈ ఇక టాప్-3 ఎవరని అడుగా... భరణి, ఇమ్మాన్యుయల్, సంజన మరియు హరిత హరీష్‌ల పేర్లు చెప్పాడు. ఇక వారి ఆటతీరును మెచ్చుకున్నారు. అంతేకాకుండా, ఒక కంటెస్టెంట్‌పై 'బిగ్ బాంబ్' వేయమని నాగార్జున చెప్పాడు. ప్రియకు బాత్రూమ్ డ్యూటీని అప్పగించాడు‌ మనీష్. హౌస్ లో మనీష్ ఆటతీరు ఎలా అనిపించింది. అతని ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అనిపిస్తే కామెంట్ చేయండి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.