English | Telugu

పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత 2...


పవన్ కళ్యాణ్ - రాశి నటించిన గోకులంలో సీత మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది అప్పట్లో. ఐతే ఇప్పుడు రాశి ఆనాటి విషయాల గురించి ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. "నా కూతురు ఫస్ట్ బర్త్ డేకి కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేసాను. ఐతే అప్పటికి నేను ఏ అపాయింట్మెంట్ తీసుకోలేదు. నేను నా డ్రైవర్ కి చెప్పాను. అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చేసాం మేడం అన్నాడు. సరే వాళ్ళ స్టాఫ్ కి పలానా ఆవిడ వచ్చారని చెప్పు అన్నాను. ఈ మాటలు కళ్యాణ్ గారి చెవిలో పడి అక్కడ నుంచి నన్ను పిలుస్తున్నారు. మా డ్రైవర్ ని మళ్ళీ నా దగ్గరకు పంపించి నన్ను తీసుకురమ్మని చెప్పారు.తిడుతున్నారు ఆవిడ వస్తే ఎందుకు అంత సేపు కూర్చోబెట్టారు అని.

నేను వెళ్లాను ఒక 20 నిముషాలు మాట్లాడారు. గోకులంలో సీత మూవీ టైములో జరిగిన విషయాల గురించి మాట్లాడారు. నా ఫామిలీ గురించి ప్రతీ విషయం అడిగి తెలుసుకున్నారు. గోకులంలో సీత మూవీ చేస్తున్నప్పుడు హాయ్, హలో, బై తప్ప ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. ఆయనకు సిగ్గు ఎక్కువ, డౌన్ టు ఎర్త్, అమ్మాయిలతో ఎక్కువగా కలవరు. ఇప్పుడు మాట్లాడేసరికి ఆనందంగా అనిపించింది. వీలయితే మా అమ్మాయి బర్త్ డేకి తప్పకుండా రావాలి అని అడిగాను. ఊళ్ళో ఉంటే డెఫినిట్ గా వస్తాను అని చెప్పారు. ఇక వెళ్లిపోయేటప్పుడు ఆయన కూడా లేచి కార్ వరకు వచ్చి నన్ను సాగనంపారు. అది కళ్యాణ్ గారు అంటే. గోకులంలో సీత 2 చేయాలనుకుంటున్నారా ..నేనైతే రెడీ అని చెప్పాను. పెళ్లయ్యాక కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు. పెళ్ళవక ముందు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది కదా పెళ్లయ్యాక శ్రీరామచంద్రుడు అయ్యారా..శ్రీకృష్ణుడయ్యాడా అన్నది ఉంటుంది" అంటూ నవ్వుతూ చెప్పింది రాశి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.