English | Telugu

సిగ్గుపడుతూ కాబోయే వాడి కోసం లవ్ లెటర్ రాసిన కావ్య

బుల్లితెర మీద నిఖిల్ - కావ్య ఒక నైస్ పెయిర్ అని పేరు తెచ్చుకుంది. పెళ్లి చేసుకుందాం అనుకున్న టైములో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నిఖిల్ ఉన్న షోస్ లో కావ్య , కావ్య ఉన్న షోస్ లో నిఖిల్ కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం షోలో కావ్య వచ్చింది. అందులో పెళ్లి సందడి మూవీలో "మా పెరటి జాంచెట్టు" సాంగ్ ని ప్లే చేసి పెళ్ళైన అమ్మాయిలు భర్తల కోసం పెళ్లి కానీ అమ్మాయిలు కాబోయే వాళ్ళ కోసం లవ్ లెటర్స్ రాయాలంటూ శ్రీముఖి టాస్క్ ఇచ్చింది. ఇక ఆ స్టేజి మీద కొందరు పడుకుని కొందరు కూర్చుని లవ్ లెటర్స్ రాశాయి. అందులో కావ్య కూడా లవ్ లెటర్ రాసింది. దాన్ని శ్రీముఖి అలాగే కావ్య కూడా చదివి వినిపించారు. "నువ్వు ఎక్కడ ఉన్నవో ఎలా ఉన్నవో తెలీదు. కానీ నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ నుంచి నా సర్వం అంతా నువ్వే ఐపోతావు. ఏ ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను. కంటి రెప్పలా నిన్ను చూసుకుంటా" అని రాసింది. "ఎవరి కోసం రాసావు" అని అవినాష్,

శ్రీముఖి అడిగేసరికి "కాబోయే వాళ్ళ కోసం" అని చెప్పింది కావ్య. దాని అవినాష్, హరి కలిసి గట్టిగా అరుపులు అరిచేసరికి "కాబోయేది పాస్ట్ గురించి కాదు రాసింది" అని క్లారిటీ ఇచ్చింది కావ్య. 10 కి 9 .75 మార్క్స్ ఇచ్చింది శ్రీముఖి. తర్వాత కావ్య ఆ లెటర్ ని చాలా ప్రేమగా చదివి వినిపించింది సిగ్గుపడుతూ.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.