English | Telugu

Bigboss 9 Telugu : కాఫీ కోసం తనూజని ఎత్తుకున్న సుమన్ శెట్టి.. సాధించేశారుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో మూడో వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. హౌస్ లోని వారంతా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి రెడి అయ్యారు. హౌస్ లో ఏది ఊరికే రాదు.. రెంటర్స్ ఓనర్స్ అయ్యారు ఒనర్స్ రెంటర్స్ అయ్యారు. తనూజకి కాఫీ అంటే ప్రాణం.. రెంటర్స్ గా ఉన్నప్పుడు కాఫీ కూడా తనకి దొరకలేదు. ఇప్పుడు ఓనర్స్ అయ్యాం కదా సర్ కాఫీ పౌడర్ పంపించండి అని వీకెండ్ లో నాగార్జునతో తనూజ రిక్వెస్ట్ చేసింది. నిన్న తనకి కాఫీ పౌడర్ వచ్చింది కానీ సంజన ని ఇంప్రెస్ చెయ్యాలి.. తను ఇంప్రెస్ అయి మీకు కాఫీ పౌడర్ ఇవ్వాలని బిగ్ బాస్ మెలిక పెడతాడు.

దాంతో తనూజ కామెడీ స్క్రిప్ట్ చెయ్యాలని ఇమ్మాన్యుయల్ ని పిలుస్తుంది‌. తను రానని అంటాడు. ముందు పవన్ కళ్యాణ్ ని తీసుకొని వెళ్లింది. తనతో వర్క్ అవుట్ అవట్లేదని ఇప్పుడు పిలుస్తుందని ఇమ్మాన్యుయల్ అలుగుతాడు. ఇక చాలా సేపు చూస్తుంది తనూజ. నువ్వు స్క్రిప్ట్ చేసి మీ అమ్మని ఇంప్రెస్ చేసి తనూజకి కాఫీ పౌడర్ ఇప్పించమని భరణి చెప్పగానే ఇమ్మాన్యుయల్ వెళ్తాడు.

డీమాన్ పవన్ , సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్ ముగ్గురు కాలేజీలో స్టూడెంట్స్.. సుమన్ కి తనూజ లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఈ స్క్రిప్ట్ లో సుమన్, తనూజ ఇద్దరు నేచురల్ గా చేశారు. చివరికి తనూజని సుమన్ ఎత్తుకొని తిరుగుతాడు. స్క్రిప్ట్ బాగుండటంతో సంజన ఇంప్రెస్ అయి తనూజకి కాఫీ పొడి ఇస్తుంది. దాంతో లేట్ చేయకుండా తనూజ వెళ్లి కాఫీ పెట్టుకొని తాగుతుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.