Read more!

English | Telugu

మా కుటుంబంలోకి రాకింగ్ రాకేష్


జబర్దస్త్ రాకింగ్ రాకేష్ తనకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని తన ఫాన్స్ తో షేర్ చేసుకున్నాడు. రాకేష్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. జబర్దస్త్‌ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో రాకేష్ కూడా ఒకరు. నార్మల్ గా కామెడీ చేసే స్టేజి నుంచి ఎదుగుతూ వచ్చి ఇప్పుడు టీం లీడర్ అయ్యాడు. తన కామెడీ పంచులు, డైలాగులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. రీసెంట్ గా జోర్దార్ సుజాతను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసాక రాకేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. జబర్దస్త్‌ స్టేజి మీద  ఈ జోడీకి ఎంతో క్రేజ్‌ ఉంది.

అలాంటి రాకేష్ ఇప్పుడు "మా" అసోసియేషన్ లో లైఫ్ మెంబర్ కార్డు సంపాదించాడు. ఆ కార్డు ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుని "మిమిక్రీ" ఆర్టిస్ట్ నుంచి "మూవీ" ఆర్టిస్ట్ గా, కళామ"తల్లి" ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో "మా" కుటుంబంలోకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అందరికి" అని చెప్పాడు.

"సుజాత గారిని పెళ్లి చేసుకున్నాక బాగా కలిసొచ్చిందండి మీకు...కంగ్రాట్యులేషన్స్ సర్ .. ఆల్  ది  బెస్ట్  రాకేష్ అన్న... రాకెట్ లాగా దూసుకెళ్లి పో ఇంకా" అంటూ నెటిజన్స్ అంతా విషెస్ చెప్తున్నారు.  అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసే రాకింగ్ రాకేష్.. ఆ తర్వాత సుజాతతో పాటు ఇంకొంతమంది  లేడీ కమెడియన్స్‌తో కలిసి స్కిట్స్  చేస్తూ వచ్చాడు. రీసెంట్ ఈ ఇద్దరూ అమెరికా ర్యాలీలో నందమూరి తారకరామారావు గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొని ఒక ప్రోగ్రాం కూడా ఇచ్చారు. రీసెంట్ గా రాకేష్ బర్త్ డేని సుజాత ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. దాన్ని వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.