Read more!

English | Telugu

రాహుల్-స్వప్నల పెళ్ళి జరిగింది.. ఎమోషనల్ గా అప్పగింతలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -124 లో..  ఇక ఈ పెళ్లి జరగదు. ముహూర్తం దాటిపోయింది. ఇప్పుడు ఒక వేళ స్వప్న వచ్చిన ప్రయోజనం ఉండదు అని రుద్రాణి అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి ఈ పెళ్లి జరుగుతుందని అంటాడు. రాజ్ తో పాటు స్వప్న కావ్య కూడా వస్తారు. రాజ్ ఇంట్లో వాళ్లకి కిడ్నాప్ గురించి జరిగిందంతా చెప్తాడు.

ఆ తర్వాత అప్పటివరకు రుద్రాణి అన్న మాటలు గుర్తు చేస్తూ సుభాష్ రుద్రాణిపై కోప్పడతాడు. ఒక మాట అనే ముందు అలోచించి మాట్లాడాలి. ఇప్పటికైనా అర్థం చేసుకొని నోటిని అదుపులో పెట్టుకో అని రుద్రాణిని సుభాష్ అంటాడు. నా కొడుకు పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని నేను భయపడి అలా మాట్లాడాను.. అయిన ఇప్పుడు ముహూర్తం దాటిపోయింది కదా అని రుద్రాణి అనగానే.. అవన్నీ నీకెందుకు పంతులు గారు చూసుకుంటారని అపర్ణ అంటుంది. పంతులు గారు చూసి ఇంకో అరగంటలో మంచి ముహూర్తం ఉందని చెప్తాడు. ఆ లోపు నువ్వు స్వప్నని తీసుకొని వెళ్ళి రెడీ చేసుకురా.. చేతికి గాయం అయినట్లు ఉంది ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొనిరా అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత రాహుల్ వెళ్లి పెళ్లి పీటలపై కూర్చుంటాడు.

'స్వప్న బ్యాగ్ లో తలంబ్రాలు ఉన్నాయి.. నువ్వు వెళ్ళి తీసుకొనిరా' అని కావ్యని కనకం పంపిస్తుంది. ఆ తర్వాత స్వప్నని పెళ్లి పీటల మీదకి తీసుకొని వెళ్తారు. మరొక వైపు స్వప్న బ్యాగ్ దగ్గరికి వెళ్ళి తలంబ్రాల కోసం చూస్తున్న కావ్యకి.. ఫోన్ రింగ్ వినిపిస్తుంది. అది స్వప్న ఫోన్.. తన  ఫోన్ కి  అరుణ్ కాల్ చేస్తాడు. ఇతనేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడని కావ్య అనుకొని లిఫ్ట్ చేసి సైలెంట్ గా ఉంటుంది. మాట్లాడేది స్వప్న నే అనుకున్న అరుణ్ మొత్తం మాట్లాడతాడు. "స్వప్న నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు రాహుల్ ని ప్రేమించావు.. అందుకే నా ప్రేమ త్యాగం చేశాను. నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్దం చెప్పేలా చేసావ్. నువ్వు హ్యాపీగా ఉండు" అని అరుణ్ ఫోన్ కట్ చేస్తాడు. అదంతా విన్న కావ్య షాక్ అవుతుంది. ఇదంతా రాజ్ కి తెలిస్తే మా ఫ్యామిలీ మొత్తం ఇలాగే మోసం చేస్తారా అంటాడు. ఎలాగైనా ఈ పెళ్లి జరుగక ముందే నిజం చెప్పాలని అనుకుంటుంది. కానీ కావ్య వచ్చే లోపే  రాహుల్, స్వప్నల పెళ్లి జరుగుతుంది. 

ఆ తర్వాత కావ్య అక్క ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిస్తే ఈ ఇంట్లో అక్క పరిస్థితి.. నా పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత స్వప్నని ఎప్పుడు కోడలిగా ఒప్పుకోనని రుద్రాణి చెప్తుంది. పెళ్ళి తర్వాత స్వప్న అప్పగింతల్లో కనకం కృష్ణమూర్తి ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.