Read more!

English | Telugu

కొడైకెనాల్ టూర్ లో బ్రహ్మముడి సీరియల్ కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఇప్పుడు అత్యధిక టీఆర్పీ తో నెంబర్ స్థానంలో కొనసాగుతుంది. ఈ సీరియల్ లోని కనకం-కృష్ణమూర్తిల కుటుంబం ఒక మధ్యతరగతి కుంటుంబం. ఇందులో స్వప్న, కనకం ఆశలు గాల్లో ఉండగా.. కావ్య, కృష్ణమూర్తి ల ఆలోచనలు బాగుండాలి.. నిజాయితీగా ఉండాలి.. ఎవరిని నొప్పించకూడదనే విధంగా ఉంటాయి. అయితే ఈ ఫ్యామిలోని కావ్య, అప్పు, స్వప్న అందరికీ సుపరిచితమే..  కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఇప్పుడు ప్రతీ కుటుంబంలో ఒక అమ్మాయిలా  మారిపోయింది. ప్రతిరోజూ దీపిక రంగరాజు తన ఇన్ స్టాగ్రామ్ లో  'బ్రహ్మముడి' సీరియల్ కి సంబంధించిన వివరాలను షేర్ చేస్తుంటుంది. 

అయితే తాజాగా దీపిక రంగరాజు ఒక యూట్యూబ్ ఛానెల్ ని మొదలుపెట్టింది. ఆ ఛానెల్ లో తన మొదటి వీడియోకి మంచి స్పందన లభించడంతో ఇక అప్పటి నుండి రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది కావ్య అలియాస్ దీపిక రంగరాజు.

ఓ వైపు 'బ్రహ్మముడి' సీరియల్ షూటింగ్ జరుగుతుంటే కళ్యాణ్, కనకం, రాజ్ , అపర్ణ అందరూ కలిసి లూడో, కబడ్డీ ఆడుతూ రీల్స్ చేస్తు సరదాగా గడుపుతున్నారు. మరోవైపు సమ్మర్ వెకేషన్ అంటూ  రుద్రాణి(షర్మిత) ఎంజాయ్ చేస్తుంది. అలాగే కావ్య(దీపిక రంగరాజు) కొడైకెనాల్ వెళ్ళి అక్కడి ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వ్లాగ్ చేసింది.‌ ఈ వ్లాగ్ 'సమ్మర్ లో బ్రేక్ తప్పనిసరి' అనే టైటిల్ తో  తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది కావ్య. కాగా ఈ వ్లాగ్ కి అత్యంత వీక్షకాధరణ లభిస్తోంది.