Read more!

English | Telugu

బిగ్ బాస్ సీజన్-7 లోకి ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం నటి!

శోభా శెట్టి ఈ పేరు ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ మోనిత అంటే తెలియని వారుండరు. స్టార్ మా టీవీ చూసే ప్రేక్షకులకు మోనిత సుపరిచితమే. బుల్లి తెరపై సంచలనం సృష్టించిన సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ లో కార్తీక్, దీప ఇద్దరు ఎంత పాపులరో లేడీ విలన్ మోనిత అంతే ఫేమస్. మోనిత అటిట్యూడ్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఆశ్చర్యం లేదు.

బుల్లి తెరపై 'లేడి విలన్' అంటే మొదటగా గుర్తుకొచ్చేది మోనిత. పాత్రకి తగ్గట్టు తనని తాను మల్చుకొని, ఆ పాత్రలో ఒదిగిపోయింది మోనిత. ప్రేమించినవాడిని ఎలాగైనా దక్కించుకోవాలనే శాడిస్ట్  క్యారెక్టర్ గా మోనిత చేసిన నటన గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. మోనిత(శోభా శెట్టి) కార్తీక దీపం లో కీలకపాత్ర పోషించింది. అయితే కార్తీకదీపం సీరియల్ మంచి క్లైమాక్స్ లేకుండా ముగియడంతో కార్తీక దీపం-2 ఉంటుందనే వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయినట్లు వార్తలు వినిపించినా ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఏ అప్డేట్ రాలేదు. అయితే శోభా శెట్టి తెలుగులో కార్తీకదీపం తర్వాత ఏ సీరియల్ లో కన్పించలేదు. అయితే శోభా శెట్టి  ప్రస్తుతం తన యూ ట్యూబ్ ఛానల్ లో వ్లాగ్ లు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూ వస్తుంది.

శోభా శెట్టి బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో 7 లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ లో గ్రాంఢ్ గా లాంచ్ అవుతోన్న ఈ షోకి కంటెస్టెంట్స్ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారని, వాళ్లతో అగ్రిమెంట్స్ కూడా పూర్తి అయినట్లుగా సమాచారం. కాగా శోభా శెట్టి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తుంది. శోభా శెట్టి ఇప్పటికే తన అందం, అభినయంతో అందరిని ఆకట్టుకుంది. 'కార్తీకదీపం' సీరియల్ లో నెగెటివ్ రోల్ తో ఆకట్టుకున్న శోభా శెట్టి.. బిగ్ బాస్ సీజన్-7 లో తనలో ఉన్న పాజిటివ్ ని చూపిస్తుందా లేక సీరియల్ లో మాదిరి నెగెటివ్ ని చూపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ సీజన్-7 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది.