Read more!

English | Telugu

కన్నకొడుకు ఆచూకీ కోసం ఏడ్చేసిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -791 లో.. వసుధార గురించి మహేంద్ర కాలేజీలో అడుగుతాడు. అలా వసుధార గురించి అడగడం చూసిన రిషి.. నేను ఇక్కడ ఉన్నట్లు డాడ్ కి వసుధార చెప్పిందేమో, అందుకే డాడ్ వచ్చాడని అనుకుని వసుధార దగ్గరికి వెళ్తాడు రిషి. "నేను ఇక్కడ ఉన్నట్లు డాడ్ కి నువ్వే చెప్పావా" అని వసుధారని అడుగుతాడు రిషి. లేదు నేను ఎందుకు చెప్తానని వసుధార అంటుంది. నువ్వు చెప్పకుండానే  డాడ్ ఇక్కడికి వచ్చారా అని రిషి అంటాడు. అన్ని అబద్ధాలు, మోసాలు.. ఇప్పటికే నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు డాడ్ కి నేను ఇక్కడ ఉన్నట్లు చెప్పకు అని వసుధారకి చెప్పి పక్కన వెళ్ళి నిల్చుంటాడు రిషి.

మరొకవైపు వసుధారని వెతుక్కుంటూ మహేంద్ర వస్తాడు. అలా వసుధార దగ్గరికి వచ్చిన మహేంద్రతో.. ఎలా ఉన్నారు సర్.. బాగున్నారా అని వసుధార అనగానే.. నీ కుశల ప్రశ్నలు వినడానికి నీ యోగ క్షేమాలు తెలుసుకోవడానికి నేను రాలేదు.. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని మహేంద్ర అడుగుతాడు. నాకు తెలియదు సర్ అని వసుధార అంటుంది. నీకు అలవాటే కదా అబద్ధాలు చెప్పడమని మహేంద్ర అంటాడు. నా కొడుకుని ఒక మోసగాడిలా చేసి నా నుండి నా కొడుకుని దూరం చేశారు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడో నీకు తెలియకుంటే నాకు ఫోన్ ఎందుకు చేసావ్? నేను చేస్తే ఎందుకు లిఫ్ట్ చెయ్యలేదని వసుధారతో మహేంద్ర అంటాడు. రిషి సర్ గురించి ఏదైనా తెలిసిందేమో అని కాల్ చేసాను సర్. మళ్ళీ మీరు చేసింది నేను చూడలేదు. అందుకే లిఫ్ట్ చెయ్యలేదని వసుధార అంటుంది. ఇన్ని రోజులుగా చెయ్యనిది.. ఇప్పుడే ఎందుకు చేసావ్.. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావ్ నా కొడుకు గురించి నీకు తెలుసు. అసలు నా కొడుకు చేసిన తప్పేంటి? నిన్ను ప్రేమించడమా పెళ్లి చేసుకోవాలనుకోవడమా అని మహేంద్ర అంటాడు. అసలు మీరు ఆ రోజు ఆబద్దం చెప్పడానికి కారణమేంటంటే అక్కడ జగతి చెప్పదు.. ఇక్కడ నువ్వు చెప్పవని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. అదంతా దూరం నుండి చూస్తూ రిషి ఎమోషనల్ అవుతాడు.

ఆ తర్వాత వసుధార బాధని దాచుకుంటుంది. నాకు రిషి సర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు సర్ అని వసుధార అంటుంది. రిషిని మోసం చేసినట్లు నన్ను చెయ్యకండి.. రిషి కనిపిస్తే నాకు చెప్పమని మహేంద్ర అంటాడు. రిషి ఇక్కడే ఉన్నాడేమో అని నా మనసుకి అనిపిస్తుందని మహేంద్ర చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మహేంద్ర అన్న మాటలకు వసుధార బాధపడుతూ రిషి వైపు చూస్తుంది. మహేంద్ర వెళ్తుంటే రిషి ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత రిషి ఇంటికి వెళ్లి. మహేంద్ర మాటలు గుర్తు చేసుకుంటాడు. ఈ వసుధార ఏంటి ఇంకా నన్ను ప్రేమగా చూస్తుంది. తన కళ్లలో ప్రేమ కన్పిస్తుంది. ఎలా నా మీద ప్రేమని తీసెయ్యలి.. ఇక నుండి నేను వాళ్లకి కొత్తగా కన్పించాలి. నాపై ప్రేమ లేకుండా చెయ్యాలని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.