Read more!

English | Telugu

కృష్ణ, మురారి హోమం సక్సెస్.. ముకుంద ప్లాన్ ఫెయిల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -185 లో.. కృష్ణ మురారి హోమం చేయడం చూసి తట్టుకోలేక ముకుంద కళ్లు తిరిగి కింద పడుతుంది. అది చూసిన కృష్ణ, మురారిలు పూజలో నుంచి లేస్తుండగా.. "నేను చూసుకుంటాను..మీరు కానివ్వండి. మార్నింగ్ నుండి ఏం తినలేదు కదా అందుకే ముకుందకి ఇలా అయ్యింది" అని రేవతి చెప్పి ముకుందని లోపలికి తీసుకొని వెళ్తుంది.

ముకుందని పడుకోపెట్టిన రేవతి.. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసిన హోమం ఆగదని అనుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళు అలా హోమం చెయ్యడం నచ్చని ముకుంద.. మళ్ళీ పూజ దగ్గరికి వెళ్లి వాళ్లనే చూస్తుంటుంది. మరొకవైపు ఎన్ని జన్మలకు అయినా కృష్ణనే నా భార్యగా రావాలని మురారితో, అదేవిధంగా కృష్ణతో కూడా ఎన్ని జన్మలకైనా మురారినే భర్త గా రావాలని పంతులు ప్రమాణం చేయిస్తాడు. ఏంటి వీళ్ళకి మళ్ళీ నిజమైన  పెళ్లి జరుగుతున్నట్లు ఉందని ముకుంద అనుకుంటుంది. కృష్ణ, మురారి లు హ్యాపీగా ఉంటే ఓర్వలేకపోతుంది ముకుంద.

ఆ తర్వాత హోమం పూర్తవుతుంది. మురారి తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తుంటాడు. అసలు ఏసీపీ సర్ ప్రమాణం  చేస్తుంటే మొహంలో హ్యాపీనెస్ కన్పించింది. నేను అంటే ఏసీపీ సర్ కి ఇష్టమేమోనని కృష్ణ అనుకుంటుంది. అదే విధంగా మురారి కూడా అనుకుంటాడు. కృష్ణ సంతోషంగా ఉంది నేను అంటే ఇష్టమేమోనని మురారి అనుకుంటాడు. ఇద్దరు ఎదురెదురుగా ఉండి తమ ప్రేమని ఒకరికొకరు చెప్పాలనుకుంటారు. కానీ ఎక్కడ ఒకరంటే ఒకరికి ఇష్టం లేదని అంటారేమో అని భయం తో ఇద్దరు సైలెంట్ గా ఉంటారు.

మరొకవైపు మురారి, కృష్ణ ఇద్దరు కలిసి చేసిన ప్రమాణం గుర్తు చేసుకుంటూ ముకుంద బాధపడుతుంది. "కృష్ణ ఇష్టం కాబట్టి తన పక్కన కూర్చొని హోమం చేసాడు.. ఇష్టం లేకుంటే అంత హ్యాపీగా ఉండేవాడు కాదు కదా.. మన ప్రేమని మర్చిపోయి ఎలా కృష్ణ తో హ్యాపీగా ఉండగలుగుతున్నావ్ మురారి.. ఎలాగైనా నా ప్రేమని కాపాడుకుంటాను" అని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఉదయం కృష్ణ, మురారి నిద్రలేస్తారు. కాసేపు నేను అంటే నేను ముందు వెళ్లి ఫ్రెష్ అవుతానని సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.