English | Telugu

ధర్మవరానికి అల్లుడినైపోతాను అన్న రిషి సర్...మరి వసుధారా

ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో శ్రీముఖి చేసే ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు. ప్రతీ వారం ఓ రేంజ్ లో ఉంటుంది ఫన్. ఈ వారం కూడా అలాగే ఉండబోతోంది. ఈ షోకి బుల్లితెర స్టార్స్ అందరూ వచ్చేసారు. ఇక రిషి సర్ కూడా వచ్చారు. ఈయన వచ్చాడంటే ఫాన్స్ హడావిడి మాములుగా ఉండదు కదా. ఆడియన్స్ లోంచి కోమలి అనే అమ్మాయి లేచి "రిషి సర్ మీరంటే నాకు ఇష్టం..మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు." అని అడిగింది. "మీరు నన్ను చేసుకుంటారా..ధర్మవరానికి అల్లుడైపోతా" అన్నాడు "మీరు చేసుకుంటానంటే చేసుకుంటాను" అంది కోమలి .

అవినాష్ వైఫ్ అనుజాకు నటి శ్రీ ఫోన్ చేసి "అవినాష్ నాకు ఫోన్ చేసి డైలీ ఐ లవ్ యు చెప్తున్నాడు..లవ్ సింబల్స్ పంపిస్తున్నాడు ఏమేమో చేస్తున్నాడండి" అని చెప్పేసరికి "మరో నటి ప్రిన్సి వచ్చి మా అమ్మాయి ఎంత మాత్రం సెలబ్రిటీ ఐతే ఇలా చేయడం బాగుందా వదిలేస్తామనుకుంటారా" అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేసరికి "ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉందే" అంది అనుజా. వెంటనే అవినాష్ ఫోన్ తీసుకుని "ఐనా మీ ఆయన అలా ఎలా చేస్తాడు" అని భార్య అనుజాతో అనేసరికి "నీ పని చెప్తా ఇంటికిరా" అని ఫోన్ లోనే ఇచ్చిన వార్నింగ్ వినేసరికి అందరూ నవ్వేశారు. "పుష్ప 3 లో ఒక క్యారెక్టర్ ఉందండి" అంటూ సిద్దార్ధ్ వర్మ గీతూకి ఫోన్ చేసి చెప్పేసరికి "నాకు ఇదేదో ప్రాంక్ కాల్ మాదిరిగా ఉందే" అని గీతూ అంది. ఇలా ప్రాంక్ కాల్ సెగ్మెంట్ ఫుల్ ఎంటర్టైన్ చేసింది.

తర్వాత అవినాష్ కళ్ళకు గంతలు కట్టేసి ఒక్కో నటి వచ్చి టచ్ చేస్తారు. అప్పుడు ఆ నటి ఎవరు వాళ్ళ పేరు చెప్పాలి అని మరో టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. అవినాష్ కళ్ళకు గంతలు కట్టేసాక ప్రిన్సి వచ్చి వీపు మీద గట్టిగా రెండు దెబ్బలు కొట్టేసి వెళ్ళిపోయింది. కౌశిక్ వచ్చి ముద్దు పెట్టేసరికి "ఓ చంద్ర ముఖి శ్రీముఖి" అన్నాడు. శ్రీముఖినే ముద్దు పెట్టింది అని అనుకున్నాడు. తర్వాత అవినాష్ చెంపల్ని సవరదీసి లాగి పెట్టి కొట్టేసరికి వాసంతి అంటూ గుర్తుపట్టేసాడు. చెంపను గట్టిగా గిల్లేసరికి దీపికా అంటూ గుర్తుపట్టేసాడు. ఇలా ఈ షో ప్రేక్షకులను అలరించనుంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.