Read more!

English | Telugu

అబ్బే కొవ్వు తప్ప ఏం లేదండి.. అనసూయ బోల్డ్ రిప్లై!

అనసూయ భరద్వాజ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. టెలివిజన్ రంగంలో యాంకర్ గా అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ..‌ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించిన అనసూయ.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తను అప్లోడ్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోల మీద  విమర్శలు వచ్చాయనేలోపే మళ్ళీ కొత్తగా తన బికినీ ఫోటోలతో హాట్ టాపిక్ గా మారింది.

అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వీకెండ్ పార్టీలని, హోమ్ టూర్ అని, సమ్మర్ వేకేషన్ అంటూ తన ప్రతీ అప్డేడ్ ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. అయితే నిన్న మొన్నటిదాకా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో గొడవ పడుతూ పోస్ట్ లు చేసిన అనసూయ‌.. ఆ గొడవ సద్దుమణిగిందనేలోపే మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. జ్యువలరీ ప్రమోషన్స్, శారీ ప్రమోషన్స్ అంటూ బ్రాండ్స్ కోసం ప్రచారం చేస్తూ బిజీగా ఉంటున్న అనసూయ.

వీకెండ్ ప్లాన్స్ అంటూ శుక్రవారం నుండే ఇన్ స్టాగ్రామ్ లో తన అప్డేడ్స్ ని షేర్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో బికినీ ఫోటోలను షేర్ చేసింది. అయితే అందులో టాటూని చూపిస్తూ ఉన్న ఫోటో ఒకటి, నడుముని చూపిస్తూ మరొక ఫోటో ఉండగా వాటిమీద ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 'ఒక ప్యామిలీ ఉంది. బయట ఎలా ఉండాలో ఆ మాత్రం తెలియదా' అంటూ ఒకరు కామెంట్ చేయగా, రెచ్చిపోతున్న రంగమత్త అంటూ మరొకరు, అబ్బే కొవ్వు తప్ప ఇంకేం లేదండి అని ఒకరు కామెంట్ చేయగా దానికి అనసూయ.. 'కొవ్వు మీకున్నట్టు మాట్లాడుతున్నారు కదా' అని రిప్లై ఇచ్చింది. అయితే అనసూయ ఇలా రిప్లై ఇచ్చేసరికి 'జస్ట్ అనసూయ థింగ్స్' అని ఒకరు సూపర్ అని మరొకరు తనకి సపోర్ట్ గా నిలుస్తున్నారు. 'లేటు వయసులో ఘాటు అందాలు' అంటూ మరొకరు కామెంట్ చేసారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. దీంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది అనసూయ.