English | Telugu

ఏంజెల్ ప్రియ, ఛార్మింగ్ త్రిష.. ఇన్ స్టాగ్రామ్ ని తిడుతున్న అఖిల్ !

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ ముందు వరకు ఎవరికి పెద్దగాతెలియదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-4 తో ఎంతో పాపులారిటి సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు మోనాల్ గజ్జర్ తో నడిపిన లవ్ ట్రాక్ మామూలుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు తనకి నచ్చినట్టుగా ఉండేవాడు అఖిల్. అతని బిహేవియర్ చాలా మందికి నచ్చేది కాదు. అంతేకాకుండా హౌస్ లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్, అభిజిత్ ల పంచాయతీ వీధుల్లో కుళాయిల దగ్గర ఉండే కొట్లాటలాగా ఉండేది. అఖిల్ బిగ్ బాస్-4 రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా మరోసారి ఎంట్రీ ఇచ్చి.. అందులో కూడా రన్నరప్ గానే నిలిచాడు.

అయితే తాజాగా అఖిల్ మంచి పాపులారిటీ సంపాదించుకొని.. ఈవెంట్స్, షోస్ తో బిజీ గా ఉంటున్నాడు. అంతేకాకుండా బిబి జోడిలో తేజస్వినితో జతకట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బిబి జోడి షోలో హాట్ పెర్ఫార్మన్స్ ఎవరంటే అఖిల్-తేజస్వినిల పేరే వినిపిస్తుందని అనడంలో ఆశ్చర్యమే లేదు. బిబి జోడీలో సైతం కౌశల్ తో.. నువ్వా నేనా అంటూ మాటల యుద్ధమే జరిగిందని చెప్పాలి. అయితే కొన్ని కారణాల వల్ల అఖిల్ జోడీ ఫైనల్ వరకు వెళ్ళలేదు. అఖిల్ కి కండరాల నొప్పి వల్ల తన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. దీంతో డాక్టర్లు కొన్నిరోజులు అఖిల్ ని డ్యాన్స్ చేయవద్దని చెప్పారట.‌అందుకనే బిబి జోడీ షో నుండి అఖిల్ తప్పుకున్నాడు.

అఖిల్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు. " 699 కే బ్లూ టిక్ ఇచ్చుడేందిరా.. ఆ రూపాయి ఎందుకు వదిలేసినవ్ రా లేకి నాయాలా.. మేం ఎక్కడికి పోవాలే. ఇప్పుడు కొత్త కొత్త పేర్లు వస్తాయి.. ఏంజెల్ ప్రియ, చార్మింగ్ త్రిష.. గట్లాంటి పేర్లు వస్తాయి. ఏం తెల్వని పోరగాళ్ళేమో మోసపోతారు. యూజర్స్ మీకే చెప్తున్నా అర్థం చేస్కోండి. ఇలా వెరిఫైడ్ అని చెప్పి మీ డాటా అంతా తీసుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఫేక్ వాటిని నమ్మి మోసపోకండి. ఆ తర్వాత బాధపడకండి " అంటూ ఇన్ స్టాగ్రామ్ ఫౌండర్స్ మీద మండిపడ్డాడు‌. ఒకవైపు ఇన్ స్టాగ్రామ్ లో 699 కే బ్లూ టిక్ ఆప్షన్ ఇస్తుండంటతో.. యూజర్స్ డబ్బులు కట్టి వెరిఫైడ్ చేపించుకుంటున్నారు. మరి అఖిల్ సార్థక్ మాటలు ఎంత మంది వింటారో, ఎంత మంది ఫాలో అవుతారో చూడాలి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.