పైసల్ తక్కువ పిల్లలెక్కువ వుండేవాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు
జబర్దస్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జ్ గా శ్రీదేవి విజయ్ కుమార్, కృష్ణ భగవాన్ వచ్చారు. ఇక నూకరాజు, కొమరక్కా ఇద్దరూ కలిసి ఒక స్కిట్ వేశారు. అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చెప్పుకొచ్చారు. "మిడిల్ క్లాస్ అంటే ఏమిటి" అని కొమరక్కా అడిగేసరికి " పైసల్ తక్కువ పిల్లలెక్కువ వుండేవాళ్ళనే మిడిల్ క్లాస్ అంటారు" అంటూ నూకరాజు చెప్పారు. "పైసలు తక్కువున్నప్పుడు పిల్లలెందుకు ఎక్కువ" అని అడిగింది. "రిచ్ పర్సన్..పని తప్ప వేరే కోరిక ఉండదు. మిడిల్ క్లాస్. కోరికలు తప్ప పనులే ఉండవు" అని చెప్పాడు. ఇక రాంప్రసాద్, సున్ని కలిసి వేసిన స్కిట్ లో బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పాడు. "మన బెస్ట్ ఫ్రెండ్ ఏరా మనం నాశనమైపోవాలని కోరుకుంటాడు ఫస్ట్" అన్నాడు రాంప్రసాద్. "అదేంట్రా నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ వేగా" అన్నాడు సున్ని. "నీకు మందు అలవాటు చేసింది. నీ కెరీర్ డల్ కావడానికి కారణం ఎవరు" అనేసరికి "నువ్వు" అన్నాడు సన్నీ. "ఇప్పుడు నేనేమవుతాను" అన్నాడు రాంప్రసాద్.