English | Telugu

Illu illalu pillalu : ధీరజ్ కోసం ప్రేమ తపన.. బతుకమ్మ ఆటలో ఇరు కుటుంబాలు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -286 లో.. నర్మద పేరెంట్స్ ని తీసుకొని వచ్చి సాగర్ నర్మదకి సర్ ప్రైజ్ ఇస్తాడు. నర్మద తన పేరెంట్స్ ని చూసి సంతోషపడుతుంది. అమ్మా మీరేలా వచ్చారని నర్మద అడుగుతుంది. సాగర్ వచ్చి.. నా వల్ల మీ కూతురిని బాధపెట్టకండి అని రిక్వెస్ట్ చేసాడు.. దాంతో మీ నాన్న కూడా ఏం అనలేదని నర్మద వాళ్ళ అమ్మ అంటుంది. ఆ తర్వాత సాగర్ దగ్గరికి నర్మద వెళ్లి హగ్ చేసుకొని థాంక్స్ చెప్తుంది. నువ్వు మా కుటుంబం కోసం ఏంత చేస్తున్నావ్.. ఈ మాత్రం చేయలేనా అని సాగర్ అంటాడు.

Brahmamudi : కావ్య కోసం వెళ్ళిన రాజ్.. తన మాట మార్చుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -848 లో.....నా నిర్ణయం అయితే నేను మార్చుకోను. కావ్యని ఎలా ఒప్పిస్తారో నాకు తెలియదు కానీ నేను చెప్పింది చెయ్యాలని రాజ్ తెగేసి చెప్పి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఇక గొడవలు అయితే మాత్రం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు అప్పు జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుంది. అత్తయ్య అన్ని మాటలు అంటుందిని కళ్యాణ్ తో అప్పు చెప్తూ బాధపడుతుంది. అసలు అలా వదినని అమ్మ అన్ని మాటలు అనడానికి కారణం నువ్వే.. నువ్వు సరిగ్గా భోజనం చెయ్యకపోవడంతో నీ కడుపులో బిడ్డకి ఏమైనా అవుతుందేమోనని అమ్మ అంటుందని అప్పుతో కళ్యాణ్ అంటాడు.

బలం కావాలంటే తాగాలి పాలు... నాకు కావాలి బాలు 

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఇల్లు-ఇల్లాలు-పిల్లలు వెర్సెస్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ వాళ్ళు వచ్చారు. ఇక ప్రభాకర ఆమనితో ముచ్చట్లు పెట్టింది శ్రీముఖి. "ఎలా ఉన్నారు రామరాజు గారు" అని అడిగింది. "మీరు ఎలా ఉంటారు అనుకున్నాను. చూస్తే మా వైఫ్ లో బుజ్జమ్మను చూసినట్టే ఉన్నారు" అని చెప్పాడు ప్రభాకర్. "బుజ్జమ్మ గారు సెట్ లో కూడా ఇంతే రొమాంటిక్ గా ఉంటారా ఏంటి" అంటూ ఆమనిని అడిగింది. "ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారు" అని చెప్పింది. ఇక గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుంచి వచ్చిన హీరో బాలు శ్రీముఖికి ఒక కంప్లైంట్ చేసాడు. "వీడికి ఎంత కస్టపడి ఫర్నిచర్ షాప్ పెట్టిస్తే షాప్ ఓనర్ లా రావాలి కానీ వీడేమో మెకానిక్ షాప్ ఓనర్ లా వచ్చాడు." అంటూ సీరియల్ లో తన తమ్ముడు మనోజ్ గురించి చెప్పుకొచ్చాడు.