English | Telugu

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్-9 లోకి ప్రభాస్ ఫ్రెండ్.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరంటే!


బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 9వ సీజన్ రంజుగా సాగుతున్నది. సెలబ్రిటీలు వర్సెస్ కామన్ మ్యాన్ గ్రూపులకు మధ్య జరుగుతున్న వార్ అంచనాలకు మించి కొనసాగుతున్నది. సెలబ్రిటీలకు ఏ మాత్రం తగ్గుకుండా కామన్ మ్యాన్స్ మాత్రం అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు. నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్, ఇలా ప్రతీ టాస్క్‌లోను రెండు గ్రూపులు సత్తా చాటుతున్నాయి. అయితే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2.O గురించి చర్చ జరుగుతున్నది.

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో 2.O వెర్షన్‌లో భాగంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది. వారి ఎంట్రీ 5వ వారం చివర్లో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సింగర్ సాయితేజ్, టీవీ యాక్టర్ సుహాసిని, అలేఖ్య చిట్టి పికిల్స్, దివ్వెల మాధురి వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ గా కన్ఫమ్ అయినట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అయితే వీరితో పాటు టాలీవుడ్ టాప్ కమెడియన్ ప్రభాస్ శీను కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ శీను ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు. విక్రమార్కుడు, పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, ఊసరవెల్లి, గబ్బర్ సింగ్, సింగిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే వందల సినిమాల్లో నటించాడు. కాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, శ్రీను ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాచ్ మేట్స్ గా కూడా ఉన్నారు. ఇక ప్రభాస్ సినిమాల్లో హీరోగా బిజీ అయిన తర్వాత పర్సనల్ అసిస్టెంట్ గా ప్రభాస్ డేట్స్ శ్రీనునే మేనేజ్ చేస్తున్నాడు. ఇటీవలే సింగిల్ సినిమాతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ప్రభాస్ శీను చేతిలో మరో రెండు, మూడు సినిమాలున్నాయి. మరి ఈ సినిమాలకు బ్రేక్ ఇచ్చి అతను బిగ్ బాస్ సీజన్-9 లోకి వస్తాడా లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.