English | Telugu

లయ ఎనర్జీ ఏమీ తగ్గలేదు...శ్రీకాంత్ సొట్టబుగ్గలే ఇష్టం నాకు

జీ తెలుగు కుటుంబం అవార్డ్స్  2025 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఈవెంట్ గా సీనియర్స్ జూనియర్స్ అన్న తేడా లేకుండా అందరూ వస్తున్నారు. ఇంద్రజ, ఆలీ, రాశి, శ్రీకాంత్ వంటి వాళ్లంతా వచ్చారు. ఇక ఇప్పుడు లయ వచ్చింది. లయ 90s హీరోయిన్. హీరో వేణుతో కలిసి "స్వయంవరం" మూవీతో ఫుల్ పాపులర్ అయ్యింది. తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యింది. "ప్రేమించు, మిస్సమ్మ, నీ ప్రేమకై, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం" వంటి మూవీస్ లో నటించింది.  ఇక రీసెంట్ గా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ షోకి వచ్చింది. ఇక నల్ల కళ్ళజోడు పెట్టుకుని శ్రీకాంత, లయ చేసిన డాన్స్ మాములుగా లేదు. "చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లయను చూడడం.

ఢీ షోలో కన్నీళ్లు పెట్టుకున్న పండు..దేవుడు వరమిస్తే ఒక్క రోజైనా పండులా బతకాలి

ఢీ షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఆడియన్స్ ని అలరించింది. ఐతే భూమిక పెర్ఫార్మెన్స్ కి ముందు పండు విజయ్ బిన్నీ మాష్టర్ దగ్గరకు వచ్చి "మీరెంత పెద్ద తప్పు చేశారో తెలుసా అబ్బాయిలతో పోటీ పడే ఏకైక కెపాసిటీ ఉన్న అమ్మాయి భూమిక అంటూ పొగిడారు. ఆ మాటకు ఆ అమ్మాయి పిచ్చెక్కి పోయి ఎలాంటి డాన్స్ లు చేస్తుందో తెలుసా" అంటూ భూమిక చేసిన డాన్స్ ని చూపించాడు. ఇక సాంగ్ ఐపోయాక భూమికకు వోట్ చేశారు జడ్జెస్ కూడా. తర్వాత నందు పండుని స్టేజి మీదకు పిలిచాడు. "ఇటుక మీద ఇటుక పెడితే" సాంగ్ పండు ట్రేడ్ మార్క్ సాంగ్ ఐపోయింది అని చెప్పాడు. ఆ సాంగ్ వైరల్ ఐనందుకు ఒక మాషప్ వీడియోని ప్లే చేసి చూపించారు. ఇక పండు గురించి ఆది మాట్లాడాడు."మనోడు ప్రతీ సీజన్ లో తన మార్క్ ని క్రియేట్ చేసేవాడు.

Bigg boss 9 Telugu : బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో ప్రభంజనం సృష్టిస్తున్న సుమన్ శెట్టి!

బిగ్ బాస్ హౌస్ లో అయిదో వారం టాస్క్ లతో ఫుల్ ప్యాక్ డ్ ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది. గత రెండు రోజుల నుండి టాస్క్ లు జరుగుతూనే ఉన్నాయి. అందుకు టీమ్ లుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ అన్ని జంటలకి టాస్క్ ఇస్తాడు. రూమ్ లోకి వెళ్లి అక్కడ రెడ్ క్లాత్ పై ఉన్న ఐటమ్ ని గుర్తు పెట్టుకొని వచ్చి డ్రా చెయ్యాలి.. డ్రా చేసిన దాన్ని బట్టి తన టీమ్ మేట్ అదే ఐటమ్ వెళ్లి తీసుకొని రావాలి. అలా మొదటి రౌండ్ కి దివ్య గీసిన డ్రాయింగ్ చూసి భరణి కరెక్ట్ గా తీసుకొని వస్తాడు. రెండో రౌండ్ కి సంజన డ్రా చేయగా ఫ్లోరా కరెక్ట్ గా తీసుకొని వస్తుంది.

Illu illalu pillalu : బతుకమ్మ పేర్చిన రామరాజు కోడళ్ళు.. కొడుకులకి అగ్నిపరీక్షే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -284 లో.....ధీరజ్, నేను ముద్దు పెట్టుకున్నామో లేదో అన్న కన్ఫ్యూషన్ ఉంది అక్క నువ్వు ధీరజ్ ని అడుగు అక్క అని నర్మదని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ధీరజ్ వస్తుంటే నర్మద ఆపి మాట్లాడుతుంది. ప్రేమ చాటు నుండి అంతా వింటుంది. నిన్న బ్యాచిలర్ పార్టీలో ఏదో అయిందంట కదా అని అడుగుతుంది. ఏం అయింది పార్టీ బాగా జరిగిందని ధీరజ్ అంటాడు. ప్రేమ వింటున్న విషయం ధీరజ్ చూస్తాడు. దాంతో ఏమో వదిన కరెంటు పోయింది. నాకేం తెలియదని ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

Brahmamudi : రాజ్ కి విడాకులు ఇస్తానన్న కావ్య.. అప్పు షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్  'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -846 లో..... అప్పు డల్ గా ఉండడంతో ధాన్యలక్ష్మిని రుద్రాణి తీసుకొని వచ్చి .. నీ కోడలు చూడు ఎలా ఉందో.. దీనికి కారణం ఆ కావ్య.. ఇలా ఉంటే పుట్టే బిడ్డపై ఎఫెక్ట్ కలుగుతుందని రుద్రాణి అంటుంది. దాంతో ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. కళ్యాణ్ ని పిలిచి అప్పుని అలా బయటకు తీసుకొని వెళ్ళు అని చెప్తుంది. దాంతో కళ్యాణ్ సరే అంటాడు. అప్పు దగ్గరికి వచ్చి బయటకు వెళదాం.. అమ్మ నిన్ను ఇలా చూసినట్లు ఉంది.. అందుకే బయటకు తీసుకొని వెళ్ళు అంది అనగానే అప్పు సరే అంటుంది.