English | Telugu
Mask man Harish Elimination : మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురికి మాస్క్ ఉందంట!
Updated : Oct 6, 2025
బిగ్ బాస్ సీజన్-9 లో నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఇక వీకెండ్ లో నాగార్జున కొంతమందికి పర్ఫామెన్స్ బాలేదంటూ క్లాస్ పీకాడు. నామినేషన్లో ఉన్న ఆరుగురిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇక చివరగా దివ్య నిఖిత, మాస్క్ మ్యాన్ హరీష్ నామినేషన్లో ఉన్నారు.
ఇక వారిద్దరికి ఓ గ్లాస్ లతో కూడిన వాల్ ని ఇచ్చారు వాటిని బ్రేక్ చేస్తే సేఫా, ఎలిమినేషనా అని తెలుస్తుందని నాగార్జున కౌంట్ డౌన్ చెప్పగానే.. హరీష్ ఎలిమినేషన్ బోర్డ్ కనబడింది. అది చూసిన నాగార్జున.. హరీష్ యూ ఆర్ ఎలిమినేషన్ అని చెప్పాడు. ఇక కాసేపటికి స్టేజ్ మీదకి వచ్చాడు మాస్క్ మ్యాన్ హరీష్. ఇక వచ్చీ రాగానే తన జర్నీ వీడియో చూపించాడు నాగార్జున. ఇక హౌస్ లో ఎవరు మాస్క్ తో ఉన్నారు.. ఎవరు విత్ అవుట్ మాస్క్ ఉన్నారో చెప్పమని హరీష్ ని నాగార్జున అడిగాడు. డీమాన్ పవన్ , భరణి, ఇమ్మాన్యుయల్ ఇంకా మాస్క్ తో ఉన్నారని, దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్, తనూజ విత్ అవుట్ మాస్క్ ఉన్నారని మాస్క్ మ్యాన్ హరీష్ చెప్పాడు.
భరణి గారిని నేను బాగా గమనించాను.. ఇన్ ఫ్లూయెన్ అనే పేరుతో అందరిని ఆయన మానిపులేట్ చేయగలరు.. అందరితో మంచిగా ఉన్నట్లుగా నటిస్తారు.. ఆయన ట్రూ సైడ్ నేను చూశాను సర్.. అందుకే నేను ఫస్ట్ నుంచి ఇప్పటివరకు దానికే స్టిక్ అయి ఉన్నాను.. అందుకే నేను ఆయనతో ఆ దూరం మెయింటైన్ చేస్తున్నాను.. ఎప్పుడొచ్చిన ఆయన హగ్ చేసుకున్నా, ఏం చేసినా కూడా నేను ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేశాను.. ఆయన మాస్క్ వేసుకొని ఉన్నారనుకుంటున్నా.. మీరన్నారు కదా రేలంగి మావయ్య అది కరెక్ట్ అంటూ హరీష్ చెప్పాడు. ఆ తర్వాత బ్లాక్ మాస్క్ మీద ఇమ్మానుయేల్ ఫోటో పెట్టాడు. సార్ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్.. కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది.. ఫస్ట్‌లో ఆయనకి నాకు ఒక గొడవ జరిగినప్పుడు ఒక ట్రూ సైడ్ చూశాం కద సర్.. అది నా మీద తప్ప మిగతా ఎవరి మీదా ఆయన చూపించలేదు.. అందరితో ఫ్రెండ్లీగా ఉందాం.. కలిసి వెళ్లిపోదాం అన్నట్లు ఉంటారు కానీ ఆయన నిజ స్వరూపం ఇంకా బయటికి చూపించలేదని నాకు అనిపిస్తుంది.. అని హరీష్ అన్నాడు. ఈ మాటలకి ఏమో సార్ నేను అయితే జెన్యూన్‌గానే ఉన్నాను.. ఆయన అభిప్రాయం అది అంటూ ఇమ్మాన్యుయల్ రిప్లై ఇచ్చాడు. ఇలా ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్పుకొచ్చాడు హరీష్.