English | Telugu
Brahmamudi : కావ్య ప్లాన్ ఫెయిల్..... రాజ్ తగ్గేదేలే!
Updated : Oct 8, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -845 లో......రాజ్ భోజనం చెయ్యడానికి వస్తాడు. అక్కడే అపర్ణ, ఇందిరాదేవి, కావ్య ఉంటారు కానీ రాజ్ పిలిచిన వడ్డించడానికి ఎవరు పోరు.. దాంతో రాజే వడ్డించుకొని తింటాడు. ఆ తర్వాత రాజ్ గదిలోకి పడుకోవడానికి వస్తాడు. మీరు ఇక్కడేం వద్దు బయట హాల్లో పడుకోండి అని రాజ్ ని కావ్య బయటకు పంపిస్తుంది. రాజ్ హాల్లోకి వస్తాడు.
మరొకవైపు సుభాష్ నిద్రపోతుంటే కొడుకు, కోడలు అలా ఉంటే ఈయన మంచిగా పడుకుంటాడా అని అపర్ణ నిద్ర లేప్తుంది. రాజ్ కావ్య సఖ్యతగా ఉండేంత వరకు మీరు హాల్లోనే పడుకోవాలని సుభాష్ ని అపర్ణ పంపిస్తుంది. రాజ్ దగ్గరికి సుభాష్ వెళ్తాడు. నాకు అదే పరిస్థితి అంటూ ప్రకాష్ ఎంట్రీ ఇస్తాడు. రాజ్ ఇవన్నీ ఎందుకురా నువ్వు అసలు నిజం ఏంటో చెప్పమని రాజ్ ని సుభాష్ రిక్వెస్ట్ చేస్తాడు. రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు. మరుసటి రోజు రాజ్ స్నానం చేస్తుంటే కావ్య, ఇందిరాదేవి కలిసి వాటర్ ఆఫ్ చెయ్యాలని ప్లాన్ చేస్తారు. వాటర్ ఆగిపోవడంతో రాజ్ ఏమైందని అడుగుతాడు.
నేనే ఆఫ్ చేశాను.. ఇప్పుడు నిజం చెప్పండి బిడ్డని ఎందుకు వద్దని అనుకుంటున్నారోనని అని కావ్య అడుగుతుంది కానీ రాజ్ మాత్రం నిజం చెప్పడు. మరొకవైపు అప్పు డల్ గా ఉంటుంది. అది చూసి ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వెళ్లి తనని తీసుకొని వచ్చి.. అప్పుని చూపిస్తుంది. నీ కోడలు ప్రెగ్నెంట్ కదా అలా ఉంటే ఎలా అని ఇదంతా కావ్య వల్లే అని ధాన్యలక్ష్మితో రుద్రాణి చెప్తుంది. తరువాయి భాగంలో అప్పు కళ్ళు తిరిగిపడిపోతుంది. నా కోడలు అలా అవ్వడానికి కారణం నువ్వేనని కావ్యని ధాన్యలక్ష్మి తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.