English | Telugu

బిగ్ బాస్ వాళ్ళు ఎప్పటికి మారతారో..తెలుగు రాని వాళ్ళను తీసుకుని ఎం చేస్తారు

బుల్లితెర మీద ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అన్షు రెడ్డి. అటు ఢీ షోలో రాజుతో కలిసి చేస్తున్న హంగామాతో బాగా పాపులర్ అయ్యింది అలాగే ఇప్పుడు ఇల్లు - ఇల్లాలు -పిల్లలు అనే సీరియల్ లో నటిస్తోంది. ఆమె రీసెంట్ గా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది. అందులో ఆమె ఎం రాసిందంటే... " నిజం చెప్పాలంటే, తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేని నటులను  ఎందుకు తెలుగు బిగ్‌బాస్‌లోకి తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. బేసిక్ క్రైటీరియా ప్రకారం కనీసం తెలుగు మాట్లాడ్డం, అర్ధం చేసుకోవడం లాంటివి తెలిసి  ఉండాలి. బిగ్‌బాస్‌లోకి రావాలనుకునే చాలా మంది తెలుగు నటులు ఉన్నారు.. ఆ విషయం నాకు పర్సనల్ గా కూడా తెలుసు. కానీ వారిని అసలు పరిగణలోకి తీసుకోవడమే లేదు. ఐతే ఇతర భాషల్లో వస్తున్న బిగ్ బాస్ లోకి ఎంతమంది తెలుగు వాళ్ళను తీసుకున్నారు ? సీరియల్స్ లో, సినిమాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది కానీ అక్కడ డబ్బింగ్ , ప్రామ్ప్టింగ్ అవకాశాలు ఉన్నాయి.

మురళి బాబాయ్ కి నాగబాబు ప్రామిస్

సోషల్ మీడియాలో చిరంజీవి సాంగ్ "ఆంటీ కూతురా" అంటూ అద్భుతమైన స్టెప్పులేసి అడగరగొట్టేసిన మురళి బాబాయ్ గురించి తెలియని వారుండరు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఆయన్ని ఢీ షోకి కూడా పిలిపించారు. ఇక ఇప్పుడు "ఈ దీపావళికి మాస్ జాతర" షోకి కూడా పిలిచారు. "సల్లకొచ్చి ముంత దాస్తే లాభంలేదు " అనే సాంగ్ కి అభి మాష్టర్, రోహిణి అలాగే శేఖర్ మాష్టర్ తో కలిసి డాన్స్ ఇరగదీసాడు డాన్సర్ మురళి బాబాయ్. ఆయన డాన్స్ కి శేఖర్ మాష్టర్ ఐతే "హ్యాట్సాఫ్ సర్ హ్యాట్సాఫ్ " అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇక ఈయన డాన్స్ చేస్తే పండు మాష్టర్ కి ఐతే ఎక్కడలేని ఊపు వచ్చేస్తుంది. ఇక నాగబాబు కూడా ఆయన డాన్స్ కి ఫిదా ఇపోయారు. "చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా" అని అడిగారు. "లేదు సర్. కలవాలని నా కోరిక" అంటూ మురళి బాబాయ్ చెప్పుకొచ్చారు.

మేము వస్తే ఈ స్టేజీకే కల వచ్చింది..మీరు వస్తే ఈ స్టేట్ కి కళొచ్చింది సర్

ఈ దీపావళికి మాస్ జాతర పేరుతో అక్టోబర్ 20 న ఒక ప్రొగ్రమ్ రాబోతోంది. దాని ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఈవెంట్ కి నాగబాబు, శేఖర్ మాష్టర్ వచ్చారు. ఇద్దరూ స్టేజి మీదకు వచ్చారు. "ఏదేమైనా శేఖర్ నువ్వొచ్చాక ఈ స్టేజికి అద్భుతమైన కళ వచ్చింది" అంటూ నాగబాబు శేఖర్ మాష్టర్ ని పొగిడేసాడు. వెంటనే శేఖర్ కూడా "మేమొస్తే ఈ స్టేజీకే కళ వచ్చిందేమో మీరొస్తే ఈ స్టేట్ కె కళొచ్చింది సర్" అని చెప్పాడు. ఇక ఆది వచ్చి శేఖర్ మాష్టర్ కి, నాగబాబు కొత్త వస్త్రాలున్న పాక్స్ ని ఇచ్చాడు. శేఖర్ మాష్టర్ ఐతే ఆ పాక్ చూసి "ఈ కలర్ బాబు గారికి సెట్ అవుతుంది.

Duvvada Madhuri Wildcard entry: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా దువ్వాడ మాధురి.. బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ జోరు సాగింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీనీ బిగ్ బాస్ చాలా వైల్డ్ గా ప్లాన్ చేసాడు ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతుంటే బిగ్ బాస్ లోని పాత కంటెస్టెంట్స్ కి వణుకుపుట్టింది. మూడవ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా దువ్వాడ మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ పొలిటిషన్ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్యగా దువ్వాడ మాధురి ఫుల్ వైరల్ అయింది. ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉన్న దువ్వాడ మాధురి భారీ అంచనలా మధ్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Ramya Moksha Wildcard Entry : వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా రమ్య మోక్ష.. బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్ అయిదు వారాలు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్నట్టుగా ఉంది. 2.0 అట్టహాసంగా సాగింది. నిన్నటి ఫైర్ స్ట్రామ్ ఎపిసోడ్ లో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చిన ఆరుగురిలో ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఊర మాస్ గా ఉన్నారు. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది రమ్య. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈవిడ తెలియని వారుండరు. అలేఖ్య చిట్టి పికిల్ ఎంత ఫేమసో అందరికి తెలిసిందే. ముగ్గురు అక్కాచెలెళ్లు కలిసి పికిల్ బిజినెస్ మొదలు పెట్టారు కానీ అనుకోని కారణాల వల్ల కస్టమర్స్ తో రూడ్ గా మాట్లాడిన ఆడియో బయటకు లీక్ కావడంతో ప్రశంసలు అందుకున్న వాళ్ళు విమర్శలు అందుకున్నారు. మొన్నటిదాకా ముగ్గురు అక్కా చెల్లెళ్లు సోషల్ మీడియాని షేక్ చేశారు.