English | Telugu

Bigg boss 9 Telugu : శ్రీజని బెడ్ పై నుండి పడేసిన భరణి.. బోరున ఏడ్చేసిన దివ్య!

బిగ్ బాస్ సీజన్-9 విజయవంతంగా అయిదో వారంలోకి అడుగు పెట్టింది. దానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ఒక్క కెప్టెన్ రాము తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారని బిగ్ బాస్ చెప్పాడు. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు.. బజర్ మొగినప్పుడల్లా బెడ్ పై నుండి కిందకి ఎవరు కాలు పెడతారో.. వాళ్ళకి ఇమ్మ్యూనిటీ లభించదు. చివరివరకు ఉన్నవాళ్ళకి ఇమ్మ్యూనిటీ పొంది నామినేషన్ నుండి సేవ్ అవుతారు.

మొదటగా బెడ్ పై నుండి అందరు కలిసి సంజనని తోసేస్తారు. ఆ తర్వాత సుమన్ శెట్టి ని తోసేస్తారు. తర్వాత దివ్యని తోసేస్తారు. అయితే దివ్య బయటకు వెళ్లకుండా చాలా ఫైట్ చేస్తుంది. అందరు కలిసి తనని తోసేస్తారు దాంతో దివ్య బయటకు వచ్చి ఏడుస్తుంది. ఆ తర్వాత డీమాన్ పవన్, రీతూ బయటకు వెళ్తారు. భరణి, ఇమ్మాన్యుయల్, పవన్ కళ్యాణ్, తనూజ, శ్రీజ అందరు కలిసి ఎవరు దిగాలని డిస్కషన్ చేసుకుంటుండగా.. భరణి త్వరగా శ్రీజని బెడ్ పై నుండి తోసేస్తాడు. దాంతో శ్రీజ కోప్పడుతుంది. మీరు నిజంగా రేలంగి మావయ్య లాగే బెహేవ్ చేస్తున్నారు.. మీరంతా ఫ్రెండ్స్ కాబట్టి తనూజని బయటకి పంపలేదని శ్రీజ అనేస్తుంది.

అక్కడ తనూజ కూడా ఉంది కదా ఓహ్.. మీకు బాండింగ్ ఉంది కదా అని భరణిని ఉద్దేశ్యించి శ్రీజ అంటుంది. చివరగా బెడ్ పై భరణి, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ ఉంటాడు. వాళ్ళకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. అందులో ఇమ్మాన్యుయల్ గెలుస్తాడు. ఇమ్మ్యూనిటి సాధించి నామినేషన్ నుండి సేవ్ అవుతాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.