English | Telugu

ముకుంద, మురారి కలిసి ఉన్న ఫోటోని భవాని చూస్తుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -207 లో.. ముకుంద దగ్గరికి రేవతి వచ్చి కృష్ణ గురించి ఉన్నవి, లేనివి కలిపించి ఎందుకు చెప్పావని అడుగుతుంది. నేను జరిగిందే చెప్పానని ముకుంద అంటుంది. నీ ప్రేమని నువ్వు దక్కించుకోవాలని నువ్వు చూస్తున్నావ్ కానీ అది జరగదు. మురారి ఒకప్పుడు నీ ప్రేమికుడు. ఇప్పుడు కృష్ణకి తాళి కట్టిన భర్త అని రేవతి అంటుంది. నీ వెనకాల భవాని అక్క ఉంది. కృష్ణ, మురారీల వెనకాల నేను ఉన్నాను. భవాని అక్క నీ చెప్పుడు మాటలు వింటుందేమో కానీ తప్పుడు పనులు చెయ్యదని రేవతి అంటుంది. నువ్వు చేసేది తప్పో రైటో అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ముకుందకి వార్నింగ్ ఇస్తుంది రేవతి.

మరొక వైపు భవాని అన్న మాటలు మురారి గుర్తుచేసుకుంటాడు. అప్పుడు కృష్ణ బాధపడుతూ మురారి దగ్గరికి వస్తుంది. ఏంటి కృష్ణ అసలు నువ్వు మందు తాగడమేంటని అడుగుతాడు. నేను మందు తాగలేదు. వాసన చూసాను అంతే.. ముకుంద అలా చెప్పిందని కృష్ణ అంటుంది. పెద్దమ్మ అన్న మాటలకూ బాధపడుతున్నావా అని మురారి అడుగుతాడు. లేదు నేను తప్పు చెయ్యలేదు కాబట్టి నేను బాధపడనని కృష్ణ పడుకుంటుంది. తినకుండా ఎలా పడుకుంటావని కృష్ణతో మురారి అంటాడు. ఒక ఆపిల్ అందులో నంచుకొని తినడానికి పికెల్ తీసుకొని రా అని కృష్ణ మురారికి చెప్తుంది. మురారి వెళ్తు నేను కృష్ణ కోసం డెకరేట్ చేసిన లైట్స్ ఏం అయ్యాయని మురారి అనుకుంటాడు. మరొకవైపు అలేఖ్య, మధు ఇద్దరు మాట్లాడుకుంటారు.

పాపం కృష్ణ మందు తాగలేదని నువ్వు చెప్పి ఉంటే బాగుండేదని అలేఖ్య అంటుంది. అది చెప్తుండగానే కదా పెద్దమ్మ నన్ను కొట్టిందని మధు అంటాడు. మరొక వైపు మురారి తన గదిలోకి వచ్చినట్లుగా ముకుంద ఉహించుకుంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న మురారి ముకుంద గదిలో.. మురారి ఐ లవ్ యు అని డెకరేట్ చేసి ఉంది చుసి మురారి కోపంగా లోపలికి వచ్చి.. నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా అంటూ మురారి డెకరేషన్ చెడగొడతాడు. నా ప్రేమని ఇలా చేస్తావా నిన్ను కృష్ణని ఎలా విడదీస్తానో చూడని ముకుంద అనుకుంటుంది.

ఆ తర్వాత రేవతిని అడిగి మురారి అవి తీసుకొని వస్తుంటే భవాని చూసి.. అవి ఏంటని అడుగుతుంది. కృష్ణకి ఆపిల్ ఇంకా పికెల్ అని మురారి అనగానే.. నీ భార్యని నేనేదో అన్నట్లు ఇక్కడ తినకుండా.. నీతో గదిలోకి తెప్పించుకుంటుందా అని మురారిపై కోప్పడుతుంది. మురారి కృష్ణకి ఆపిల్, పికెల్ తీసుకొని వెళ్లి తినమని చెప్తాడు. మరొకవైపు ముకుంద, మురారి కలిసి ఉన్న ఫొటోస్ ని అలేఖ్య, మధు ఇద్దరు భవానికి చూపిస్తామని వస్తుంటే.. రేవతి ఆపి ఆ ఫోటోస్ ని చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.