English | Telugu
ఒక కేజీ బరువు తగ్గిపోయాను...శ్రీముఖి అక్కకు థ్యాంక్స్!
Updated : Jul 12, 2023
"నీతోనే డాన్స్" షోలో ఏ వారం యాదమ్మ రాజు - స్టెల్లా జంట ఎలిమినేట్ అయ్యారు. తమ ఎలిమినేషన్ కి సంబంధించి వీళ్ళు ఒక వీడియో చేశారు. "రిషిక, ప్రశాంత్, గోవింద్ మాష్టర్లు మాకు డాన్స్ బాగా నేర్పించారు. మాకు షూటింగ్స్ ఉండడం వలన రాత్రి 10 గంటలకు వెళ్లి ప్రాక్టీస్ చేసి తెల్లవారు జామున 3 గంటలకు వచ్చేవాళ్ళం. నాకు డాన్స్ అనేదే కొత్త అసలు స్టేజి ఫియర్ కూడా ఎక్కువ. ఎందుకంటే చాలా కెమెరాలు ఉంటాయి. వాటిల్లో ఏది చూడాలో నాకు అసలు తెలీదు. ఫస్ట్ ఎపిసోడ్ లో నా డాన్స్ కి వంక పెట్టి అందరూ నన్నే కామెంట్ చేస్తుంటే ఈ షో నుంచి తప్పుకుందాం అనుకున్నాను. ఐతే తర్వాత నా బాధ చూసి రాజు, మాష్టర్లు ఇచ్చిన సపోర్ట్ కి నేను కొంతవరకు బాగానే చేసాను. ఇక మిగతా వాళ్ళతో పోల్చితే మా డాన్స్ లో ఎనర్జీ లెవెల్స్ తగ్గడంతో, ఎక్స్ప్రెషన్స్ తగ్గడంతో జరిగింది కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం మమ్మల్ని ఎలిమినేట్ చేశారు.
ఈ షో ఒప్పుకున్నప్పుడు నాకు చాలా ప్రెషర్ ఐపోయింది మొదట్లో..కానీ తర్వాత అలవాటైపోయింది. రియాలిటీ షో ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ముఖ్యంగా ఒక కేజీ వెయిట్ కూడా తగ్గిపోయాను డాన్స్ ప్రాక్టీస్ కి. నేను శ్రీముఖి అక్కకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను భయపడుతూ ఉన్నప్పుడు చాలా సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది. దయచేసి మా మీద ఎలాంటి నెగటివ్ ట్రోల్ల్స్ చేయకండి ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. కానీ నేను కూడా డాన్స్ చేయగలను అనే విషయం ఈ షో ద్వారానే నాకు కూడా తెలిసింది. షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అంతా కూడా చాలా బాగా చేస్తారు. మిగతా ముగ్గురు జోడీస్ టాప్ 5 లో ఉండాలి... జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి...కాబట్టి ఎక్కువ మాట్లాడితే నాకు ఏడుపొచ్చేస్తుంది" అని స్టెల్లా. స్టెల్లా అసలు ఇలా డాన్స్ చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు..ఆమెకు కొంచెం చెవికి సంబంధించిన సమస్య ఉంది అందుకే డాన్స్ సరిగా చేయలేకపోయింది అని చెప్పాడు యాదమ్మ రాజు. ఐతే ఎప్పుడూ కామెడీ గా జోక్స్ వేస్తూ అందరినీ నవ్వించే ఈ జంట ఎలిమినేట్ అయ్యేసరికి జడ్జెస్, మిగతా కంటెస్టెంట్స్ కూడా కొంత బాధపడ్డారు షోలో.