English | Telugu
రణ్వీర్ సింగ్ లాంటి అబ్బాయి కావాలి...మాకు అబ్బాయిల్లో ఈ క్వాలిటీస్ కావాలి
Updated : Jul 13, 2023
ఈ వారం "ఆదివారం విత్ స్టార్ మా పరివారం"లో బుల్లితెర నటీ నటులు వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసేసారు. ఇందులో కొంతమంది లేడీస్ కూడా వచ్చేసారు. ఇక అబ్బాయిలు కూడా వచ్చేసరికి లేడీస్ మీకు ఇక్కడున్న అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు కావాలో మీరే సెలెక్ట్ చేసుకోండి అని ఒక్కొక్కళ్ళని అడిగింది శ్రీముఖి. వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కోరికలను చెప్పేసారు.. ముందుగా హాసిని నువ్వు చెప్పు అనేసరికి ..తనకు అండర్ స్టాండింగ్ తో పాటు ప్రేమగా చూసుకోవాలని చెప్పింది. ఐతే నీకు మా కృష్ణ చాలా బాగా సెట్ అవుతాడు. బాగా చూసుకుంటాడు అని చెప్పింది శ్రీముఖి. ఇక శ్వేతా చెప్పు అనేసరికి..తనకు హైట్ గా ఉన్న అబ్బాయి కావాలి అని, బాగా చూసుకోవాలి..అప్పుడప్పుడు తాను పిచ్చి పిచ్చిగా చేసినా కూడా అర్ధం చేసుకోవాలి అని చెప్పింది. ఓకే నీకు మహేష్ సెట్ అవుతాడు అని చెప్పేసింది. తర్వాత శ్రీసత్యని అడిగింది..చాలా మంచోడై ఉండాలి. తానూ తన పేరెంట్స్ ఎలా చూసుకుంటుందో ఆ అబ్బాయి అలాగే చూసుకోవాలి అని చెప్పింది.
ఐతే నీకు మానస్ ఫిక్స్ అంది శ్రీముఖి. తర్వాత శోభాశెట్టిని అడిగింది...తనకు హైట్ గా ఉండాలని, లవ్ చేయాలి, కేరింగ్ గా ఉండాలి, కొట్టినా కొట్టించుకోవాలి, తిట్టినా తిట్టించుకోవాలని చెప్పింది. ఐతే శోభాకు అర్జున్ కళ్యాణ్ ఫిక్స్ అని చెప్పేసింది. తర్వాత డెబీజానిని అడిగింది...హైట్ ఉండాలి, స్మైల్ బాగుండాలి, అర్ధం చేసుకోవాలి అని చెప్పింది. ఐతే ఆర్జే సూర్యనే నీకు ఫిక్స్ అని చెప్పింది శ్రీముఖి..ఇలా అమ్మాయిలకు అబ్బాయిలను ఫిక్స్ చేసేసింది. చివరికి అవినాష్ వచ్చి అందరినీ అడిగావు కానీ నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు అని అడిగాడు. తనకు రణ్వీర్ సింగ్ లాంటి అబ్బాయి కావాలని, హైపర్ యాక్టీవ్ గా ఉండాలని చెప్పింది శ్రీముఖి.